పలాసలో హత్యా రాజకీయాలకు తెర తీస్తారా?
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:11 AM
పలాస ప్రాంతాన్ని ప్రశాంతంగా చూడాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎటువంటి కక్షలు, వేధింపులకు పాల్పడడం లేదని, ప్రశాం తంగా ఉన్న పలాసలో మళ్లీ హత్య రాజకీయాలు చేస్తారా అని ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ మంత్రి అప్పలరాజును ప్రశ్నించారు.
పలాస, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పలాస ప్రాం తాన్ని ప్రశాంతంగా చూడాలనే ఉద్దేశంతో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినా ఎటువంటి కక్షలు, వేధింపులకు పాల్పడడం లేదని, ప్రశాం తంగా ఉన్న పలాసలో మళ్లీ హత్య రాజకీయాలు చేస్తారా అని ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ మంత్రి అప్పలరాజును ప్రశ్నించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు హత్య కుట్రలో 17 మంది నిందితులు సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతో తీసుకున్న ఫొటోలను ప్రదర్శించారు. ఇటీవల పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించిన సమయంలో కూడా నీతో ఒక నిందితుడు ఉన్నారని, బీహార్ నుంచి ముఠాను తెప్పించి వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ఈ కేసు విచారణ కొనసాగుతుందని, ఇందులో మాజీ మంత్రి పాత్ర ఉందని తెలిస్తే తగు చర్యలు తీసుకుం టామని హెచ్చరిం చారు. మా కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత నీకులే దన్నారు. సమావేశంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లొడల కామేశ్వరరావు, గురిటి సూర్యనారా యణ, చంద్రశేఖర్ త్యాడి, కుత్తుమ లక్ష్మణరావు, గాలి కృష్ణారావు, టంకాల రవిశంకర గుప్తా, మల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.