Share News

‘శంఖారావం’తో వైసీపీలో గుబులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:15 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల శంఖారావం యాత్ర పలాసలో విజయవంతం కావడంతో వైసీపీ నేతల్లో గుబులు పుట్టిందని కాళింగ సంక్షేమసంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, టీడీపీ సమన్వయకర్త దువ్వాడ హేమబాబు చౌదరి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై సోషల్‌ మీడియాలో వికృత పోస్టులు పెడు తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. లోకేశ్‌ జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతు న్నారన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా పలాస సభకు ప్రజలు, మహిళలు తరలిరావ డం శుభపరిణామమని, దీంతో వైసీపీ నేతల్లో వణుకుపుట్టిందన్నారు. మంత్రి అప్పలరాజు ఓటమి ఖాయమని, దీంతోనే తమ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

‘శంఖారావం’తో వైసీపీలో గుబులు

పలాస: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల శంఖారావం యాత్ర పలాసలో విజయవంతం కావడంతో వైసీపీ నేతల్లో గుబులు పుట్టిందని కాళింగ సంక్షేమసంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, టీడీపీ సమన్వయకర్త దువ్వాడ హేమబాబు చౌదరి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై సోషల్‌ మీడియాలో వికృత పోస్టులు పెడు తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. లోకేశ్‌ జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతు న్నారన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా పలాస సభకు ప్రజలు, మహిళలు తరలిరావ డం శుభపరిణామమని, దీంతో వైసీపీ నేతల్లో వణుకుపుట్టిందన్నారు. మంత్రి అప్పలరాజు ఓటమి ఖాయమని, దీంతోనే తమ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:15 AM