Share News

పని ఇక్కడ.. వేతనం అక్కడ!

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:36 PM

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి 8 వరకూ ప్రత్యే క పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించింది. వర్షాల నేప థ్యంలో ప్రతి పంచాయతీలోనూ జంగిల్‌ క్లియరెన్స్‌తో పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

పని ఇక్కడ.. వేతనం అక్కడ!
గంగరాజపురంలో పనులు చేస్తున్న ఉపాధి వేతనదారులు(ఫైల్‌)

- ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో మతలబు

- ఇటు పంచాయతీ, అటు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ శాఖ నుంచి బిల్లులకు యత్నం

(మెళియాపుట్టి)

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి 8 వరకూ ప్రత్యే క పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించింది. వర్షాల నేప థ్యంలో ప్రతి పంచాయతీలోనూ జంగిల్‌ క్లియరెన్స్‌తో పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచా యతీరాజ్‌ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పంచాయతీ ఖాతాలకు నిధులు కూడా జమచేశారు. కాగా.. వైసీపీకి చెందిన సర్పంచ్‌లే అధికంగా ఉండడం, కొంతమంది అధికారుల సహకారంతో వారు ఈ నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

- మెళియాపుట్టి మండలం శోంపాపురంలో కొంత మంది ఉపాధిహామీ మస్తర్లు వేసి.. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేశారు. మళ్లీ అదే పనికి పంచాయతీ నుంచి ఎన్‌ఎంఆర్‌ మస్తర్లు వేసి బిల్లులకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ పంచాయతీలో పారిశుధ్య కార్మికులు ఉండరో.. అక్కడ మాత్రమే 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాగా.. కొంతమంది సర్పంచ్‌లు మాత్రం ఈ నిధులు కాజేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఉపాధిహామీ పథకం నుంచి పనులు చేసిన వారికి డబ్బులు ఇచ్చి.. 15వ ఆర్థిక సంఘం నుంచి పం చాయతీ ఖాతాల్లో బిల్లులను పేర్లు మార్చేందుకు యత్నిస్తున్నారని సమాచారం. మెళియాపుట్టి మండలం లో కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లు, అధికార పార్టీ నాయకులతో కలిసి బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం నుంచి మస్తర్లు వేయడంతో బిల్లులు జన రేట్‌ అయినట్టు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికారులు దర్యాప్తు చేస్తే.. మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయ ని పలువురు పేర్కొంటున్నారు.

- ఈ విషయమై మెళియాపుట్టి ఎంపీడీవో పి.చంద్ర కుమారి వద్ద ప్రస్తావించగా.. పారిశుధ్య కార్యక్రమాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలని తెలి పారు. పనిచేసిన వారికి ఎన్‌ఎంఆర్‌ మస్తర్లు వేసి బిల్లు లు పెట్టుకోవాలన్నారు. అలా కాకుండా ఉపాధిహామీ పథకంలో మస్తర్లు వేయడానికి అవకాశం లేదని తెలి పారు. ఎక్కడైనా అవకతవకలు జరిగి ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:36 PM