టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకల దాడి
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:18 AM
మందస మండలం బుడార్సింగి పంచాయతీ పాతకోట గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య శుక్రవారం వాగ్వా దం జరిగింది.
హరిపురం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మందస మండలం బుడార్సింగి పంచాయతీ పాతకోట గ్రామం లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య శుక్రవారం వాగ్వా దం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి.. కొందరు వ్యక్తులు సారా తాగి గ్రామం లో గలాటా సృష్టిస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకు న్నారు. దీంతో అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై సుమా రు 10 మంది వైసీపీ కార్యకర్తలు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడడంతో టీడీపీ పార్టీ డిజిటల్ అసిస్టెంట్ భగవాన్ బిస్వాల్, బుయ్య, తుమ్మనాథంతో పాటు మరో నలుగురు మహిళలకు తీవ్ర గాయాల య్యాయి. ఈ దాడిలో గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త, ఆమె భర్త పాల్గొన్నట్లు బాధితులు తెలిపారు. పాత కక్షలతోనే తమపై దాడులకు పాల్పడినట్లు బాధి తుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులను హరిపురం ఆసు పత్రికి తరలించి చికిత్స చేశారు. అనంతరం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మం దస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను టీడీపీ నాయ కులు బావన దుర్యోధన, రట్టి లింగరాజు తదితరులు పరామర్శించారు.