పలాస రైల్వేస్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 14 , 2024 | 12:19 AM
పలాస రైల్వే స్టేషన్ మూడో నెంబరు ప్లాట్‌ఫారంపై ఆదివారం ఉద యం గుర్తుతెలియని యువకుడు(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- గంటపాటు నిలిచిపోయిన కామాఖ్య సూపర్‌ఫాస్ట్ రైలు
పలాస: పలాస రైల్వే స్టేషన్ మూడో నెంబరు ప్లాట్‌ఫారంపై ఆదివారం ఉద యం గుర్తుతెలియని యువకుడు(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కామాఖ్య సూపర్‌ఫాస్ట్ రైలు ప్లాట్‌ఫారంపై గంటపాటు నిలిచిపోయింది. మృతదేహాన్ని తరలిం చిన అనంతరం రైలును యదాతధంగా పంపించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కామాఖ్య రైలు పలాస మీ దుగా భువనేశ్వర్ వైపు వెళ్తోంది. ప్లాట్‌ఫారంపై నుంచి గుర్తుతెలియని యువకుడు ఒక్కసారిగా రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లాట్‌ఫారంపై రైలు వేగాన్ని నియంత్రించి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చూసిన డ్రైవరు రైలును నిలిపివేశాడు. అప్పటికే ఆ యువకుడి శరీరం నుజునుజ్జయింది. గస్తీలో ఉన్న రైల్వేపోలీసులు ఘ టన స్థలానికి చేరుకొని రైలును వెనక్కు మళ్లించారు. అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడు. అంతకు ముందు ఆ యువకుడు ఫలక్‌నుమా రైలులో వచ్చినట్లు పోలీసు లు చెబుతున్నారు. తాను మరణిస్తానని, తనను ఆపకండని తోటి ప్రయాణికులకు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో అదే రైలుకింద పడి ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయపడ్డాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించడానికి సిద్ధమవుతున్న తరుణం లో కామాఖ్య రైలుకిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం దురదృష్టకరం. హెచ్‌సీ సోమేష్‌కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడుకి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. కోల్‌కతా ప్రాంతానికి చెందినవాడిగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సి తెలిపారు.
పెళ్లింట విషాదం
- వారం రోజుల్లో కుమార్తె పెళ్లి
- రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
- కుటుంబసభ్యుల రోదన
టెక్కలి: పెళ్లింట విషాదం నెలకొంది. వారం రోజుల్లో కుమార్తె పెళ్లి జరగనుండగా.. కార్డులు ఇవ్వడానికి వెళ్లి తిరిగి వస్తుండగా కుమార్తె తండ్రిని లారీ రూపం మృత్యువు కబలించింది. స్థానికులు, కు టుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని అక్కవరం పంచాయతీ శ్యామసుం దరాపురం గ్రామానికి చెందిన రుంకు మోహనరావు కుమార్తె హిమావతికి ఈనెల 20న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో బంధువులు, స్నేహితులకు కబుర్లు చెప్పేందుకు కుటుంబ సభ్యులు తలమునకలయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం తండ్రి మోహనరావు పెళ్లికార్డులు ఇచ్చేందుకు విక్రాంపురం సైకిల్‌పై వెళ్లి తిరిగి వ స్తున్నాడు. ఆ సమయంలో జాతీయ రహదారిపై విక్రాంపురం వద్ద శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో కిందపడిపోయాడు. అయితే మోహనరావు కు చిన్నపాటి గాయాలయ్యాయని, లారీ డ్రైవర్ కొంతసేపు ఆపాడు. తరువాత లారీ పలాస వైపు వెళ్లిపోయింది. ఈలోగా స్థానికులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి మోహన రావును తరలించగా చికిత్స పొందుతూ మోహనరావు మృతిచెందాడు. ఆయనకు భార్య మాలతి, కుమారుడు చరణ్, కుమార్తె ఉన్నారు. మరో వారం రోజుల్లో జరిగే పెళ్లి ఇంట విషాదం జరగడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు న్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
మద్యం బాటిల్ పగిలి..
- రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మెళియాపుట్టి: మురికిభద్ర గ్రామానికి చెందిన సవర సురేష్ (26) శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృ తి చెందినట్లు ఎస్‌ఐ పి.రమేష్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. ద్విచక్రవాహనంపై వస్తున్న సురేష్ అదుపుత ప్పి పడిపోవడంతో కడుపులో దాచుకున్న మద్యం బాటిల్ పగిలిపోయింది. దీంతో కడుపులోకి బాటిల్ గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేమన్ని పోస్టుమార్టం కోసం పాతప ట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం
- మనస్తాపంతో భార్య ఆత్మహత్యాయత్నం
- కేశవరాయునిపాలెంలో విషాదం
లావేరు: రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా.. దీన్ని తట్టుకోలేక అతడి భార్య పురుగులు మందు తాగింది. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన నాయిన చంటి (26) శనివారం తన గ్రామం నుంచి బైక్‌పై మురపాక వస్తుండగా.. హనుమయ్యపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చంటి అక్కడిక్కడే మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక అతడి భార్య భవానీ ఆదివారం పురుగులు మందు తాగి ఆత్మహత్యహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కూడా ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతుంది. చంటి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతుండగా విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో చంటి మృతి చెందడం అందర్ని కలచివేస్తోంది. దసరా రోజున ఇటువంటి ఘటన జరగడంతో కేశవరాయునిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. చంటి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
కంచిలి: అంపురం పంచాయతీ పద్మతుల గ్రామానికి చెందిన పులి అరుణ కుమారి(27) కుటుంబ కలహాలతో శనివారం రాత్రి ఒంటిపై డీజిల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సోంపేట సీఐ మంగరాజు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరుణకుమారికి భర్త లక్ష్మీనారాయణకు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. లక్ష్మీనారాయణ ఇచ్ఛాపురం బోర్డర్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. మద్యానికి బానిసై ప్రతీరోజు భార్యతో గొడవలు పడుతుండేవాడు. తాగి రావడమే కాకుండా కొట్టడం, పుట్టింటికి వెళ్లిపోమనడం చేస్తుండేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి, కొట్టడడం కన్నవారింటికి వెళ్లిపోమన్నాడు. దీంతో మనస్తాపానికి గురై రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న డీజల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈమెకు భర్త లక్ష్మీనారాయణ తోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై సోంపేట సీఐ బి.మంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంకేసీజీలో పంచనామా నిర్వహించిన తర్వాత తహసీల్దార్ ఎన్.రమేష్‌కుమార్ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
చెరువులో జారిపడి బాలుడి మృతి
కంచిలి: కొత్త అంపురం గ్రామానికి చెందిన మద్ది త్రినాథ్(12) అనే బాలుడు శనివారం ఉదయం ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని చెరువులో జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మద్ది నీలయ్య కుమారుడు త్రినాఽథ్ దసరా సందర్భంగా తన సైకిల్‌ను కడిగేందుకు శనివారం ఉదయం పక్కనే ఉన్న చెరువుకు వెళ్లాడు. సైకిల్‌ను గట్టుపై ఉంచి బకెట్‌తో నీరు తెచ్చి, సైకిల్‌ను కడుగుతున్నాడు. ఈ క్రమంలో చెరువులో జారిపడి మునిగిపోయాడు. అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు కేకలు వేయడంతో గ్రామస్థులు వెంటనే చెరువులో దిగి త్రినాథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. నీటిలో మునిగిపోయిన బాలుడిని ఒడ్డుకు తెచ్చేసరికి అపస్మారక స్థితిలోకి చేరాడు. వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి, అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. పండుగంటి రోజున త్రినాథ్ అకాల మరణంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై బాలుడి తండ్రి నీలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రామచంద్రారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.