Share News

Srisailam: శ్రీశైలం జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

ABN , Publish Date - Aug 02 , 2024 | 09:43 AM

శ్రీశైలం జలాశయం 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో : 4,65,261 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,91,602 క్యూసెక్కులుగా ఉంది.

Srisailam: శ్రీశైలం జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

నంద్యాల : శ్రీశైలం జలాశయం 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో : 4,65,261 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 4,91,602 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 883.80 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 208.7210 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. శ్రీశైలం డ్యాం దిగువన వరదనీటలో వ్యక్తి గల్లంతు అయిన ఘటన కలకలం రేపుతోంది. శ్రీశైలం జలాశయం లింగలగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి దిగి వరద నీటిలో అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి గల్లంతు అయ్యాడు. అతను నల్లగొండ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య (50)గా గుర్తించారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం స్నేహితులతో కలిసి యాదయ్య వచ్చాడు. యాదయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఒకటో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవడం జరిగింది. గోదావరి నీటిమట్టం11.50.అడుగులకు తగ్గింది. 175 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి 9.52 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. 14 రోజుల తర్వాత లంక గ్రామాలకు వరద ప్రవాహం తగ్గింది. పునరావాస కేంద్రాల నుంచి వరద బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. వరద ప్రవాహంలో మునిగిపోయి ఉద్యాన, కాయగూరలు పంటలు కుళ్లిపోయాయి. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపారు.


పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత గోదావరి నీటిమట్టం స్పిల్ వే ఎగువన 32. 205  మీటర్లుగా ఉంది. స్పిల్ వే దిగువన 23.950 మీటర్లు నీటిమట్టం నమోదు అయ్యింది. 48 రేడియల్ గేట్ల ద్వారా 9,00,372 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ఏలూరు జిల్లా.. తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ప్లో 515 క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో 1048 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం: 355 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం: 349.62 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి నిల్వ:. 2.030 టీఎంసీలు కాగా.. పూర్తి స్థాయి నిల్వ సామర్జ్యం: 3 టీఎంసీలకు చేరుకుంది.

Updated Date - Aug 02 , 2024 | 09:43 AM