Share News

Gudlavalleru Engeneering College: ఉధృతంగా విద్యార్థుల ఆందోళన.. ఎస్పీ ప్రకటనపై మిన్నంటిన ఆగ్రహం

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:19 PM

గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతంగా మారింది. కాలేజీలోని బాలికల హాస్టల్‌లో వాష్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Gudlavalleru Engeneering College: ఉధృతంగా విద్యార్థుల ఆందోళన.. ఎస్పీ ప్రకటనపై మిన్నంటిన ఆగ్రహం

గుంటూరు: గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతంగా మారింది. కాలేజీలోని బాలికల హాస్టల్‌లో వాష్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగినా.. తిరిగి ఇవాళ ఉదయం ఆందోళన ప్రారంభమైంది. తమకు న్యాయం చేయాలంటూ విద్యా్ర్థులు నినాదాలు చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ ధర్నా చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు స్లోగన్స్ ఇస్తున్నారు. అయితే గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో సీసీ కెమెరాలు ఎక్కడా కనిపించలేదంటూ ఇవాళ ఉదయం జిల్లా ఎస్పీ ఒక ప్రకటన జారీ చేశారు. దీనిపై విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు సైతం మండిపడుతున్నాయి.


కాగా.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తాజాగా ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సైతం స్పందించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగి పరిణామాలపై తాజాగా స్పందించారు.


కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దయచేసి విద్యార్థులు అపోహలను నమ్మవద్దని, ఆధారాలు లేని విషయాలను ప్రచారం చేయవద్దంటూ ఎమ్మెల్యే రాము సూచించారు. ఎటువంటి వివక్షత లేకుండా గుడ్లవల్లేరు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని.. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థి లోకానికి తాను అన్ని వేళల అండగా ఉంటానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

Actress Jithwani: ముంబై నటి స్టేట్‌మెంట్ రికార్డు.. కన్నీరు పెట్టుకున్న జిత్వానీ

AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు

Budda Venkanna: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం

Updated Date - Aug 30 , 2024 | 12:27 PM