Share News

Summative Assessment : గణితం పేపర్‌ లీక్‌

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:13 AM

పేపర్‌ లీక్‌ కావడంతో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌--1 గణితం...

Summative Assessment : గణితం పేపర్‌ లీక్‌

  • సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌--1 పరీక్ష వాయిదా

  • లీకుపై పోలీసు కేసు నమోదు

అమరావతి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పేపర్‌ లీక్‌ కావడంతో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌-1 గణితం పరీక్ష వాయిదా పడింది. టెన్త్‌ ప్రశ్నపత్రం ఆదివారం పలు యూట్యూబ్‌ చానళ్లు, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో కనిపించింది. దీంతో పరీక్ష నిర్వహించొద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. 6 నుంచి 9 తరగతుల గణితం పరీక్షలను కూడా ఆపాలని ఆదేశించింది. లీకుపై ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎంవీ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ పరీక్షను ఈ నెల 20న నిర్వహిస్తామని, మిగిలినవి షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని అధికారులు తెలిపారు. కొంతకాలంగా పాఠశాలల్లో ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయి. గత ప్రభుత్వంలో అధికారులు దీన్ని సీరియ్‌సగా తీసుకోలేదు. ఇదే ట్రెండ్‌ ఇప్పుడూ కొనసాగుతుండటంతో కూటమి ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఆయా యూట్యూబ్‌ చానళ్లు, టెలిగ్రామ్‌ గ్రూపుల నిర్వాహకులపైనా చర్యలు తీసుకోనుంది.

Updated Date - Dec 17 , 2024 | 05:14 AM