Panchayat Raj Commissioner :చిత్తూరు జడ్పీ మాజీ ఇన్‌చార్జి సీఈవో సస్పెన్షన్
ABN , Publish Date - Jun 28 , 2024 | 05:27 AM
చిత్తూరు జడ్పీ మాజీ ఇన్‌చార్జి సీఈవో టి.ప్రభాకర్‌రెడ్డిపై వేటు పడింది. ఈ నెలాఖరులో రిటైర్ కానున్న ఆయన్ను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అ
అవినీతి ఆరోపణలు, బిల్లుల నిలిపివేత
జడ్పీ నిధులు పెద్దిరెడ్డి కోసం ఖర్చు
ఐదేళ్లు రెచ్చిపోయిన ప్రభాకర్‌రెడ్డి
పదవీ విరమణకు మూడ్రోజుల ముందు చర్యలు
చిత్తూరు రూరల్, జూన్ 27: చిత్తూరు జడ్పీ మాజీ ఇన్‌చార్జి సీఈవో టి.ప్రభాకర్‌రెడ్డిపై వేటు పడింది. ఈ నెలాఖరులో రిటైర్ కానున్న ఆయన్ను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత లేకున్నా సుదీర్ఘ కాలంపాటు జడ్పీ సీఈవో పోస్టులో ఎఫ్‌ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు)గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నాయకుల బిల్లులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం, జడ్పీ ఉద్యోగులను వేధించడం, వైసీపీ పాలనలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జడ్పీ నిధులు ఖర్చు పెట్టడం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జడ్పీలోని ప్రస్తుత, మాజీ అధికారులతో పాటు జిల్లా టీడీపీ నాయకులు కూడా ఆయన అవినీతిపై సాక్ష్యాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పెద్దిరెడ్డి ఈయన్ను కాపాడుతూ వచ్చారు. కనీసం విచారణ కూడా జరగనివ్వలేదు. ఇటీవల కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబును, ఆయన కార్యదర్శి ప్రద్యుమ్నను ఉమ్మడి జిల్లా టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు కలిసి ప్రభాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యేవరకు హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లకూడదని స్పష్టం చేసింది.