AP Election Result: ఈసీ మరో సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jun 03 , 2024 | 02:05 PM
సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఏపీ ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది.
అమరావతి, జూన్ 03: సార్వత్రిక ఎన్నికల ఓట్లతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఏపీ ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో మరో ఏజెంట్‌కు నియమించుకొనేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద మరో ఏజెంట్‌ను నియమించు కోవచ్చని ఆ యాపార్టీలకు ఈసీ సూచించింది. అభ్యర్థి లేని సమయంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించేలా సదరు ఏజెంట్‌కు ఈసారి అవకాశం కల్పించినట్లు ఈసీ స్పష్టం చేసింది.
Also Read: ఎన్నికలైపోయాయ్.. ధరలు పెరుగుతున్నాయ్.. తాజాగా వాటి రేటు పెంపు
అయితే మిగతా కౌంటింగ్ ఏజెంట్లు అందరూ రౌండ్‌కి రౌండ్‌కి మధ్య రిలాక్స్ అయ్యేలా చర్యలు సైతం చేపట్టింది. అందులోభాగంగా వారికి భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే ఏపీ అసెంబ్లీలోని భీమిలి, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి 26 రౌండ్లు గరిష్టంగా కౌంటింగ్ జరగనుంది. అలాగే రాజమండ్రి, నరసాపురంలో కనిష్టంగా 13 రౌండ్లకే ఫలితాలు వెలువడనున్నాయి. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలో 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ లోక్‌సభ నియోజకవర్గ ఫలితం అర్థరాత్రికి వెలువడే అవకాశముంది.
Also Read: ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ ఎమ్మెల్సీ కవిత నినాదాలు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వివిధ దశల్లో జరిగాయి. ఆ క్రమంలో మే 13వ తేదీన ఏపీలోని లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఒకే దశలో జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్లతోపాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది.
For more TS News and Telugu News