Share News

CM Chandrababu: సరిగ్గా ఏడాది.. అంతలో ఎంత తేడా?

ABN , Publish Date - Oct 31 , 2024 | 03:04 PM

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి తీసుకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం వదిలి వెళ్లిన లూలు గ్రూప్ సంస్థ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

CM Chandrababu: సరిగ్గా ఏడాది.. అంతలో ఎంత తేడా?

2024 అక్టోబర్ 31వ తేదీ నరక చతుర్ధశి. అంటే దీపావళి పర్వదినం. మరి 2023 అక్టోబర్ 31వ తేదీ. అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జగనాసుర పాలన చెర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడుదల చేసేందుకు సరిగ్గా బీజం పడిన రోజు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. గతేడాది ఇదే రోజు అంటే అక్టోబర్ 31వ తేదీ. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రోజు. 2023, సెప్టెంబర్ 9వ తేదీ బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నంద్యాలలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో ఏపీ సిల్క్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో అవినీతి చోటు చేసుకుందని జగన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ క్రమంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.


cbn-sir1.jpg

అనంతరం ఆయన్ని రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలించి.. ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును తరలించారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ దాదాపుగా విఫలమయ్యాయి. దీంతో 52 రోజుల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. చివరకు ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.


lokesh.jpg

ఒక్కసారిగా మారిన రాష్ట్ర రాజకీయం

చంద్రబాబు నాయుడు అరెస్ట్.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు జగన్ పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గళమెత్తారు. అందులోభాగంగా 2023, జనవరిలో యువగళం పేరిట పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో నారా లోకేశ్ తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.


nara-lokesh1233.jpg

మరోవైపు అప్పటి వరకు అంతగా బయటకు రానీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఇల్లు వదిలి ప్రజల మధ్యకు వచ్చారు. ఆ క్రమంలో నారా లోకేశ్, నారా భువనేశ్వరి... ఇద్దరు చంద్రబాబును జైల్లో కలిసి ఆయన క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేశారు.


pawan.jpg

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం

ఇక చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో జనసేనాని పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ జగన్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఆ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతో కలిసి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.


janasena.jpg

టీడీపీతో కలిసి అడుగులు వేస్తాం..

అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వెలుపల నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతో కలసి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలసి జనసేన వెళ్తుందంటూ ప్రకటించారు.


cbn-1234.jpg

పలు నగరాల్లో ఆందోళనలు

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాలు పుణే, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అంతా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు.


abn.jpg

గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు మద్దతుగా..

హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా సాప్ట్‌వేర్ ఇంజనీర్లంతా కలిసి ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు పోటెత్తారు. చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించిన ఈ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సైబరాబాద్ నిర్మాణం కోసం శ్రమించి తీరును ఈ సభలో పాల్గొన్న వక్తలు కళ్లకు కట్టినట్లు సోదాహరణగా వివరించారు.


bhuvanamma.jpg

ప్రజల్లోకి నారా భువనేశ్వరి..

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో వందల మంది మరణించారు. ఈ నేపథ్యంలో నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆ యా కుటుంబాలను పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు.. మీకు, మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండ, దండ.. గా ఉంటుందని వారికి పరిపుర్ణమైన భరోసా కల్పించారు.


ap-ele.jpg

ఇంతలో ఎన్నికలు.. దుమ్ము లేపిన ఓటర్లు

ఆ కొద్ది నెలలకే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అంతే ఆంధ్ర ఓటరు ఈ ఎన్నికల్లో ఓటుతో కొట్టిన దెబ్బకు ఫ్యాన్ పార్టీకి ప్రతిపక్ష హోదానే దక్కకుండా పోయింది. కేవలం 11 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి ఏర్పడింది.


cm-seat.jpg

మనిషి ఎలాంటి వాడు అనేది తెలియాలంటే..

మనిషి ఎలాంటి వాడు అనేది తెలియాలంటే అధికారం కానీ.. డబ్బు కానీ అతడి చేతి ఇచ్చి చూడు. ఆ తర్వాత అతడి ప్రవర్తన ఎలా ఉంటుందో.. అదే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుందంటూ మేధావులు చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. అంతే చంద్రబాబుకు మరో సారి ప్రజలు పట్టం కడితే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మాత్రం అధికారం, ప్రతిపక్షం కాకుండా కేవలం ఎమ్మెల్యేగా గెలిపించి జస్ట్ అసెంబ్లీలో నిలబెట్టారు. తద్వారా 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా వాడిలో నిగూఢంగా దాగి ఉన్న సత్తా.. ఓటు అనే వజ్రాయుధంతో క్లియర్ కట్‌గా స్పష్టం చేశాడు.


lulu.jpg

ఆంధ్రప్రదేశ్‌కు రానున్న పునర్వైభవం.. అందుకు సాక్ష్యాలు

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి తీసుకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అలాగే పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం వదిలి వెళ్లిన లూలు గ్రూప్ సంస్థ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

nara-lokesh.jpg

ఇక రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ సంస్థల అధినేతలు, సీఈవోలతో నారా లోకేశ్ సమావేశమవుతున్నారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను నారా లోకేశ్ సోదాహరణగా వారికి వివరిస్తున్నారు.

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Oct 31 , 2024 | 03:38 PM