Share News

AP Election Results: వైయస్ జగన్‌కి ఘోర పరాభవం

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:14 PM

కడప అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప. అలాంటి జిల్లాలో తాజా ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలోని పలు కీలక అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధిక్యంలో దూసుకు పోతుంది.

AP Election Results: వైయస్ జగన్‌కి ఘోర పరాభవం

కడప అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప. అలాంటి జిల్లాలో తాజా ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలోని పలు కీలక అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధిక్యంలో దూసుకు పోతుంది. కమలపురం నుంచి బరిలో దిగిన సీఎం వైయస్ జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో సొంత మేనమామను సైతం సీఎం వైయస్ జగన్ గెలుపించుకో లేకపోయారనే ఓ చర్చ సైతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడిగా నడుస్తుంది.


మరోవైపు కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మాధవీ రెడ్డి విజయం సాధించారు. అలాగే ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి, కమలపురం టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఇక రైల్వే కోడూరులో 13 రౌండ్ల కౌంటింగ్ ముగిసినప్పటికి జనసేన అభ్యర్థి అధిక్యంలో కొనసాగుతున్నారు.


ఇంకోవైపు బద్వేల్, పులివెందుల, రాజంపేట, రాయచోటిలో మాత్రం వైసీపీ అభ్యర్థులు ప్రస్తుతం అధిక్యంలో ఉన్నారు. అయితే మరికొన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలున్నాయనే ఓ చర్చ సైతం సాగుతుంది. ఏదీ ఏమైనా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి సొంత ఇలాకా కడప జిల్లాలోనే ఆయనకు ఘోర పరాభవం తప్పలేదనే ఓ ప్రచారం అయితే జిల్లాలో కొనసాగుతుంది.

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 04:44 PM