TDP : జగన్‌పై ఫర్నిచర్ చోరీ కేసు నమోదు చేయండి
ABN , Publish Date - Jun 19 , 2024 | 04:46 AM
శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణమైన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలికి విజ్ఞప్తి చేశారు.
అనంతపురం ఎస్పీకి తెలుగు మహిళల ఫిర్యాదు
అనంతపురం అర్బన్, జూన్ 18: శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణమైన మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలికి విజ్ఞప్తి చేశారు. పలువురు తెలుగు మహిళలతో కలిసి ఆమె మంగళవారం జగన్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన ఫర్నిచర్‌ను తాడేపల్లి ప్యాలె్‌సకు దొంగతనంగా తీసుకువెళ్లిన జగన్‌పై గతంలో కోడెల శివప్రసాద్‌పై పెట్టిన తరహాలోనే కేసులు నమోదు చేయాలని కోరారు.
పల్నాడు ఎస్పీకి కూడా..
జగన్ రూ.6.67 కోట్ల ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకున్నారని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రాజశేఖరరెడ్డి మంగళవారం పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన వస్తువులను, సామగ్రిని సొంతానికి వినియోగించుకున్నారని, ఆ సొమ్మును రికవరీ చేసి జగన్‌పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును ఈ నెల 25వ తేదీ లోపల పరిష్కరిస్తామని, కేసు స్టేటస్‌ను పోలీసు వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చని ఫిర్యాదుదారుడికి ఎస్పీ కార్యాలయం సమాధానం ఇచ్చింది.