AP Politics: మాజీ సీఎం జగన్‌రెడ్డికి పట్టాభిరామ్ చురకలు
ABN , Publish Date - Oct 15 , 2024 | 07:39 PM
మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బర్ పేరుతో రోజుకు కొన్ని వందల మందిని గేట్లు తెరిచి లోపలికి అనుమతిస్తున్నారు.. ఇది ప్రజాపరిపాలన అంటే అంటూ మాజీ సీఎం జగన్ రెడ్డికి పట్టాభిరామ్ చురకలంటించారు. దాదాపు రూ.5000 కోట్లు ప్రజాధనాన్ని తన విలాసాల కోసం సీఎంగా వైఎస్ జగన్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 15: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ మంగళవారం విజయవాడలో మరోసారి మండిపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో.. వ్యక్తిగత అవసరాల కోసం కోట్లాది రూపాయిలు మింగిన అనకొండ ఈ జగన్ రెడ్డి అని విమర్శించారు. జగన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెకు అయిన ఖర్చు సాధారణ పరిపాలన శాఖ లెక్కల ప్రకారం రూ.12.85 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. సీఎంగా జగన్ ఉన్న సమయంలో ఏ విధంగా వందల, వేల కోట్ల రూపాయాలు ప్రజా ధనాన్ని ఖర్చు చేశాడో.. వాటికి నిదర్శనం నేడు ప్రత్యేక్షంగా కనిపిస్తున్నాయన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌తోపాటు రూషికొండ ప్యాలస్‌లోని బాత్ టబ్‌ల నుంచి మసాజ్ టేబుళ్ల వరకు అన్ని ప్రజల సొమ్ముతోనే చేయించుకున్నారని మండిపడ్డారు.
Also Read: బుధవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఇష్టానుసారం మింగటం, సొంత ఖజానాకు చేర్చుకోవటం, మిగిలింది తన విలాసల కోసం ఖర్చు చేయడం.. ఇది జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన దినచర్య అని ఆయన అభివర్ణించారు. అలా విలాసాలకు ఖర్చు చేసిన అనేక అంశాల జాబితాలో తాడేపల్లి ప్యాలస్ చుట్టూ దాదాపు 25 నుంచి 30 అడుగుల ఎత్తున భారీ ఇనుప కంచె నిర్మించుకున్నాడని ఆయన వివరించారు. ప్రపంచంలోని ఉన్న ఏడు వింతలు ఒక ఎత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మరో వింతగా తాడేపల్లి ప్యాలెస్‌కు వేసుకున్న ఇనుప కంచె అని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
Viral Video: రైలు విండోలో నుంచి జారీ పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ప్రపంచంలో ఎవరు కూడా తమ ఇంటికి కంచె కట్టుకుని ఉండరని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఆయన.. తన సొంత నిధులతో నిర్మించుకున్నది కాదని.. అక్షరాలా రూ.12.85 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించుకున్నారన్నారు. నీ తాడేపల్లి ప్యాలెస్‌లోని ఫర్నిచర్ కోసం లేఖ రాస్తే చెక్కు రాసి ఇస్తానన్నావ్ కదా..? ఏది ఈ రూ.5000 కోట్లకు చెక్కు రాసి ఇవ్వు అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పట్టాభిరామ్ సవాల్ విసిరారు. ఆ చెక్కు తీసుకునేందుకు నేనే వస్తానని అన్నారు. గతంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను ఎంతలా వేధించావో మర్చిపోయావా..? అని ఈ సందర్భంగా జగన్ రెడ్డిని సూటిగా పట్టాభిరామ్ ప్రశ్నించారు.
Also Read: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ
గతంలో భద్రత పేరుతో అమరారెడ్డి కాలనీలోని మొత్తం 318 ఇళ్ల ధ్వంసం చేశారని గుర్తు చేశారు. అ రోజు మహిళలు అని కూడా చూడకుండా వారిని బయటకు లాగేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీ దుర్మార్గపు పాలన చూసి ఇంటిపై రాళ్లు వేస్తారనే భయంతోనే ఇనుప కంచె నిర్మించుకున్నావా.. అంటూ మాజీ సీఎం జగన్ రెడ్డిని పట్టాభిరామ్ బల్లగుద్ది మరి ప్రశ్నించారు.
Also Read: ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?
రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసం చుట్టు కూడా ఇలాంటి కంచెలు ఉండవన్నారు. దేశాధ్యక్షుల కంటే జగన్ రెడ్డికి ప్రాణహాని భయాలు ఏమైనా ఉన్నాయా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. నియంతలకు మాత్రమే ఇలాంటి కంచెలు అవసరం ఉంటుందన్నారు.
Also Read: పండగ వేళ.. పలు ప్రత్యేక రైళ్లు
మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బర్ పేరుతో రోజుకు కొన్ని వందల మందిని గేట్లు తెరిచి లోపలికి అనుమతిస్తున్నారు.. ఇది ప్రజాపరిపాలన అంటే అంటూ మాజీ సీఎం జగన్ రెడ్డికి పట్టాభిరామ్ చురకలంటించారు. దాదాపు రూ.5000 కోట్లు ప్రజాధనాన్ని తన విలాసాల కోసం సీఎంగా వైఎస్ జగన్ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆయన దుర్వినియోగం చేసిన రూ.5000 కోట్లతో ఐదేళ్ల పాటు 3 లక్షల మంది వృద్ధులకు పింఛన్ అందించ వచ్చునన్నారు. అలాగే 6 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అందించవచ్చని తెలిపారు.
8 లక్షల మంది రైతులకు ప్రతి ఏడాది రైతు భరోసా అందించ వచ్చని చెప్పారు. అలాగే పేదవారికి 1.5 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వచ్చని కె. పట్టాభిరామ్ వివరించారు. రాష్ట్రంలో పేదవాడు నిన్ను క్షమించాలంటే నువ్వు అప్పనంగా దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ స్పష్టం చేశారు.
For AndhraPradesh News And Telugu News..