Share News

TDP : పేదలకు సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మిద్దాం

ABN , Publish Date - Jun 19 , 2024 | 05:28 AM

రాష్ట్రంలో పేదలకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి అధికారులను ఆదేశించారు.

TDP : పేదలకు సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మిద్దాం

కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి: పార్థసారథి

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదలకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం తొలిసారి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆప్షన్‌-3 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి, కేటాయించిన ఇళ్లను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 08:53 AM