Share News

Minister TG Bharat : ఓర్వకల్లులో 14 వేల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:23 AM

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని రాష్ట్ర పరిశ్రమలు..

Minister TG Bharat :  ఓర్వకల్లులో 14 వేల కోట్ల పెట్టుబడులు

  • మంత్రి టీజీ భరత్‌

అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ప్రముఖ ఇండో-జపాన్‌ కంపెనీ సెమీ కండక్టర్‌ రంగంలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆ కంపెనీ ప్రతినిధులు అమరావతిలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమై పెట్టుబడులపై చర్చించారని, జనవరి రెండో వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ చేసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 04:24 AM