AP Assembly: ఇవాళ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Jul 23 , 2024 | 07:14 AM
ఇవాళ అసెంబ్లీలో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగనుంది. అనంతరం రెండు ప్రభుత్వ బిల్లులను సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఉంచనుంది.
అమరావతి: ఇవాళ అసెంబ్లీలో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. అనంతరం రెండు ప్రభుత్వ బిల్లులను సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఉంచనుంది. ‘ ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ 2024’ను సభ ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సభ ముందు రెవెన్యూ, స్టాంప్‌లు రిజిస్టేషన్ల శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉంచనున్నారు. డాక్డర్ వైఎస్ఆర్ యూనివర్సీటీ ఆఫ్ హెల్త్ సైన్స్సెస్ సవరణ బిల్లు 2024 ను సభ ముందు ప్రభుత్వం ఉంచనుంది.
డాక్డర్ వైఎస్ఆర్ యూనివర్సీటి ఆఫ్ హెల్త్ సైన్స్సెస్ సవరణ బిల్లు ను సభ ముందు ఆమోదం కోసం వైద్య ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ జరగనుంది. ఈ తీర్మాణాన్ని సభలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.
నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పోలీసు అధికారులపై రెచ్చిపోయారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే తన అసహనాన్ని ప్రదర్శించారు. పోలీసు అధికారిని ఏకవచనంతో, పేరు పెట్టి పిలిచి మరీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జగన్ అధికారిక హోదా ‘ఎమ్మెల్యే’ మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు మినహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వాహనాలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరు. ప్రతిపక్ష నేత హోదాలేని జగన్ వాహనాన్ని సోమవారం భద్రతా సిబ్బంది అసెంబ్లీ నాలుగో నంబరు గేటు వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్తుండగా అడ్డుకున్నారు. వాటికి అనుమతి లేదని స్వాధీనం చేసుకున్నారు. ప్లకార్డులను, పేపర్లను లాగేసుకున్నారు.
Read more AP News and Telugu News