AP Assembly Sessions: ముగిసిన బీఏసీ సమావేశం.. అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు
ABN , Publish Date - Jul 22 , 2024 | 01:24 PM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.
అమరాతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా సభలో శ్వేత పత్రాలను విడుదల చేసేలా అధికార పక్షం ప్రతిపాదించింది. కాగా బీఏసీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హజరయ్యారు.
కమిటీ హాల్లో ఎన్డీయే సభాపక్షం
అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన శాసనసభా పక్షం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా వైసీపీ సభ్యులు అసహనంతో ఉన్నారని కొందరు సభ్యులు వ్యాఖ్యానించారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయటపెట్టుకున్నారని పలువురు జనసేన ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
Raghurama Krishnaraju: హాయ్ జగన్ అంటూ దగ్గరకు వెళ్లి..
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున అరెస్ట్
For more AP News And Telugu News