AP News: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించనున్న కేంద్ర బృందం
ABN , Publish Date - Sep 12 , 2024 | 07:03 AM
ఈ రోజు ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటించనుంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో నష్టం కేంద్ర బృందం అంచనా వేయనుంది. రెండు బృందాలుగా జిల్లాలకు.. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.
అమరావతి: ఈ రోజు ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటించనుంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో నష్టం కేంద్ర బృందం అంచనా వేయనుంది. రెండు బృందాలుగా జిల్లాలకు.. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం.. రెండు టీమ్‌లుగా విడిపోయి మరీ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. నేటి ఉదయం 9:45కు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు కేంద్ర బృందం చేరుకోనుంది.
ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితిని కేంద్ర బృందానికి జిల్లా అధికారుల ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించనుంది. పైనుంచి కొట్టుకొచ్చిన ఓట్ల తాకిడికి దెబ్బతిన్న కౌంటర్‌లు ఉన్న ప్రాంతాన్ని కేంద్ర బృందం సందర్శించనుంది. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, మైలవరం వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. అనంతరం బెజవాడ ముంపునకు కారణమైన బుడమేరు వద్దకు కేంద్ర ప్రభుత్వం వెళ్లనుంది. ఇక్కడ నుంచి అజిత్ సింగ్ నగర్, అంబాపురం, వాంబే కాలనీ లోని ముంపు ప్రాంతాలను సందర్శించి పరిశీలించనుంది.
మరోవైపు గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 9:45కు వరద నష్టంపై కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం పెదకాకాని గ్రామంలో గుంటూరు ఛానల్‌కు పడిన గండ్లను కేంద్ర బృందం పరిశీలించనుంది. అక్కడి నుంచి వెంకటకృష్ణాపురం, దేవరాయ బొట్లపాలెంలలో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. మంగళగిరిలో దింపుడు కళ్ళెం చేనేత ప్రాంతం లో దెబ్బతిన్న నేత మగ్గాలను పరిశీలించనుంది. అనంతరం తాడేపల్లి మహానాడు సచివాలయం 1, 2 పరిధిలో వరద ముంపు గురైన బాధితులతో కేంద్ర బృందం మాట్లాడనుంది. అనంతరం వెంకటాయపాలెం గ్రామంలో వరద ముంపునకు గురైన బాధితులతోనూ మాట్లాడనుంది.