Swacha : స్వచ్ఛకడప సాధనే లక్ష్యం
ABN , Publish Date - Sep 18 , 2024 | 11:31 PM
ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ కడప సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని మున్సిపల్ కమిషనరు వైవో నందన్ పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ 2024లో భాగంగా మహవీర్‌సర్కిల్ నుంచి ఆర్ట్స్‌కళాశాల మైదానం వరకు మారథాన్ ర్యాలీ చేపట్టారు.
పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం : మున్సిపల్ కమిషనరు వైవోనందన్
చెన్నూరు వంతెనపై మారథాన్
వేంపల్లెలో విద్యార్థుల సైకిల్‌ర్యాలీ
కడప (ఎడ్యుకేషన్), సెప్టెంబరు 18: ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ కడప సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని మున్సిపల్ కమిషనరు వైవో నందన్ పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ 2024లో భాగంగా మహవీర్‌సర్కిల్ నుంచి ఆర్ట్స్‌కళాశాల మైదానం వరకు మారథాన్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని ప్రారం భించిన కమిషనరు మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి సూచనల మేరకు స్వచ్ఛతా హి సేవ 2024 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభిస్తూ మన జిల్లాలో కూడా 15 రోజుల పాటు ఈ కార్యక్రమాల ను నిర్వహిస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం రోజూ ఒక్కో కార్యక్రమం రూపొందించి అమలు చేసి చివ రి రోజు అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించి ప్రతిజ్ఞ చేస్తామన్నారు. శుభ్ర తతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనరు రాకేశ్, చెన్నకేశవరెడ్డి, ఈఈలు, ధనలక్ష్మి, నారాయణ స్వామి, మెప్మా సీఎంఎం హరిప్రసాద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోటిరెడ్డి మహిళా కళాశాలలో...
కోటిరెడ్డి మహిళా డిగ్రీకళాశాలలో స్వచ్ఛతా హి సేవ ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో స్వచ్ఛభారత్‌లో భాగంగా పరిసరాలు శుభ్రం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సలీంబాషా, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు డాక్టర్ విజయలక్ష్మిదేవి, డాక్టర్ శచీదేవి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు - కొండపేట వంతెనపై చేస్తున్న రన్నింగ్
పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం
చెన్నూరు, సెప్టెంబరు 18: శుభ్రతతోనే ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం పరిశుభ్రత చేపట్టా లని డీఎల్‌పీఓ మస్తాన్‌వల్లి అన్నారు. స్వచ్ఛతా హి సేవలో భాగంగా రెండోరోజు మండల వ్యాప్తంగా పెద్దలు, యువత, విద్యార్థులు రన్నింగ్ చేశారు. చెన్నూరు, కొండపేట హైవేవంతెనపై డీఎల్‌పీఓ, ఎంపీడీఓ ఆధ్వర్యంలో రన్నింగ్ చేశారు. డీఎల్‌పీఓ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికీ అవగా హన అవసరమన్నారు. పారిశుధ్య సిబ్బంది లేకపో తే ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలు దుర్గంధ భరింతగా మారతాయని చెన్నూరు పంచాయతీలో నిత్యం ప్రజల సేవ కోసం పారిశుధ్యం కోసం పాటు పడడం హర్షణీయమన్నారు. వారి సేవలు మరువ లేనివన్నారు. గ్రామ పంచాయతీ అంతా బ్లీచింగ్ చల్లించారు. నిల్వ ఉన్న పలురకాల కసువు కుప్పలు తొలగించారు. చెన్నూరు పంచాయతీలో రాజకీయ నేతలతో కలిసి పరిశుభ్రతపై వీధివీధినా తిరుగు తూ అవగాహన కల్పించారు. ఎంపీడీఓ సుదర్శన శర్మ, ఈఓఆర్‌డీ సురేశ్‌బాబు, సర్పంచ్ వెంకటసుబ్బయ్య, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, టీడీపీ వైసీపీ కన్వీనరు కె.విజయభాస్కర్‌రెడ్డి, జీఎన్ భాస్కర్‌రెడ్డి, అల్లాడు రాజశేఖర్‌రెడ్డి, వేల్పుల సుబ్ర మణ్యం, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ బుజ్జన్న, మన్నూరు అక్బర్, మణికంఠ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వేంపల్లెలో స్వచ్ఛతా హి సేవ సైకిల్‌ర్యాలీ
జడ్పీ హైస్కూల్ నుంచి ర్యాలీ
వేంపల్లె, సెప్టెంబరు 18: పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని ఎంపీడీఓ దివిజ, ఈఓపీఆర్డీ మల్లికా ర్జునరెడ్డి తెలిపారు. వేంపల్లె జడ్పీ హైస్కూల్ నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు విద్యార్థులతో కలిసి సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహిం చా రు. స్వచ్ఛతా హి సేవలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఇడుపు లపాయ ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛతా హి సేవ నిర్వ హించారు. క్యాంపస్ ఆవరణలో ర్యాలీ నిర్వహించా రు. పరిసరాలను శుభ్రం చేశారు. డైరెక్టర్ గుప్త, ఏఓ ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.
పొలతలలో స్వచ్ఛతా హి సేవ
పెండ్లిమర్రి, సెప్టెంబరు 18: మండలంలో ప్రసిద్ద క్షేత్రమైన పొలతల క్షేత్రంలో స్వచ్ఛతా హి సేవ నిర్వహించారు. బుధవారం నిర్వహించిన కార్యక్ర మంలో ఆలయ పరిసరాలను, గోశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొని శుభ్రం చేశారు.