Share News

AP Government: అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

ABN , Publish Date - Aug 22 , 2024 | 10:03 AM

అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది.

AP Government: అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

విశాఖ: అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం తరుఫున విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. కేజీహెచ్‌లో మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని..భాదితులకు అండగా ఉంటుందని తెలిపారు.


ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గాయపడిన వారిని పరామర్శించడానికి విశాఖ వస్తున్నారన్నారు. 41 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందుతున్న వారికి పరిహారం అందించనున్నట్టు తెలిపారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారికి వారి వారి గాయాలను బట్టి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 12 మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ జరుగుతోందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పరిధిలో కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ముగ్గురు, మెడికవర్ ఆసుపత్రి లో7 గురు చికిత్స పొందుతున్నారని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్‌కి మరికాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి బాధితులను పరామర్శిస్తారని కలెక్టర్ తెలిపారు.


మరోవైపు అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి అయ్యింది. శిథిలాల తొలగింపును రెస్క్యూ టీమ్‌ పూర్తి చేసింది. 33 మందిని జెయింట్‌ ఫైరింజిన్‌తో సిబ్బంది కాపాడింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో అతిపెద్ద ప్రమాద ఘటన ఇదే. అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. క్రైమ్ నెంబర్..169/24 గా కేసు నమోదైంది. 106.(1). 125.(B), 125 (A) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


ఫార్మా ప్రమాదంలో మృతుల వివరాలు

1. నీలాపు రామిరెడ్డి (48) అసిస్టెంట్ జనరల్ మేనేజర్

2. ప్రశాంత్ హంస (33) ప్రొడక్షన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్

3. నారాయణరావు (33) అసిస్టెంట్ మేనేజర్

4. గణేష్ కుమార్ (32) సీనియర్ ఎగ్జిక్యూటివ్

5. హారిక (22) ట్రైని ఇంజనీర్

6. రాజశేఖర్ (21) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్

7. సతీష్ (31) సీనియర్ ఎగ్జిక్యూటివ్

8. నాగబాబు (35) అసిస్టెంట్ మేనేజర్

9. నాగేశ్వర రామచంద్ర రావు 47 (అసిస్టెంట్ మేనేజర్, టీం లీడర్)

10. సన్యాసినాయుడు (55) హౌస్ కీపింగ్

11. చిన్నారావు (33) పెయింటర్

12. పార్థసారథి (27) ఫీట్టర్

13. మోహన్ దుర్గాప్రసాద్ (19) హౌస్ కీపింగ్ బాయ్

14. ఆనందరావు (36) అసిస్టెంట్ మేనేజర్

15. సురేంద్ర (37) అసిస్టెంట్ మేనేజర్

16. వెంకట సాయి (27) సీనియర్ ఎగ్జిక్యూటివ్

17. చిరంజీవి (24) ఫిట్టర్

18. గుర్తు తెలియని వ్యక్తి

Updated Date - Aug 22 , 2024 | 10:25 AM