Share News

Pensions: వేకువజాము నుంచి ప్రారంభమైన పింఛన్ల పంపిణి కార్యక్రమం

ABN , Publish Date - Aug 01 , 2024 | 08:40 AM

ఇవాళ ఉదయం నుంచే ఎన్‌టీఆర్ సామాజిక భరోసా ఫించన్ల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా... దేవరపల్లి నల్లజర్ల గోపాలపురం మండలాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

Pensions: వేకువజాము నుంచి ప్రారంభమైన పింఛన్ల పంపిణి కార్యక్రమం

అమరావతి: ఇవాళ ఉదయం నుంచే ఎన్‌టీఆర్ సామాజిక భరోసా ఫించన్ల పంపిణి కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా... దేవరపల్లి నల్లజర్ల గోపాలపురం మండలాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 5 గంటల నుంచే జిల్లా అంతటా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుల ఇంటి వద్దనే ఎమ్మెల్యేలు, అధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తూరులో పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. దేవరపల్లి మండలం లో నీ దుద్దుకూరు బందపురం చిన్నాయిగూడెం గ్రామాల్లో అరగంట ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఆలస్యంగా పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, షోకాజ్ నోటీసులు అందజేస్తామని దేవరపల్లి ఎంపీడీవో తెలియజేశారు.


విశాఖ జిల్లాలో ఎన్‌టీఆర్ సామాజిక భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలో 1,63, 210 మందికి..70.05 కోట్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీ కోసం 4,398 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ రోజు, రేపటి కల్లా పింఛ‌న్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందు వలన పెన్షన్ల పంపిణీకి ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. ఉమ్మడికడప జిల్లా వ్యాప్తంగా వేకువ జాము నుంచి పింఛన్లను సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రూ.329.44 కోట్లు పంపిణి చేయనున్నారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పలు వార్డ్‌లలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి పంపిణీ చేశారు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టేశారన్నారు. కూటమి ప్రభుత్వం లో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చి ప్రజల్లో ఆనందం నింపుతారని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే డా. పాశిం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉదయం 6.00 గంటల నుంచేఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 08:40 AM