Share News

Theater Controversy : థియేటర్‌ వివాదం - కేసుల మయం

ABN , Publish Date - Oct 12 , 2024 | 12:18 AM

పట్టణంలో ఒక సినిమా థియేటర్‌ వివాదంలో పోలీసులు ఇప్పటికే మూడు కేసులను నమోదు చేశారు. ఈ వివాదంలో రాజకీయ జోక్యం కలగడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నా రు. థియేటర్‌ స్థలం నాదంటే నాదని స్థానికులు పర స్పరం వాదులాడుకుంటున్నారు. స్థానిక రియల్‌ ఎస్టే టర్లు కొందరు ఈ వివాదంలో తలదూర్చడం విశేషం. ఈ వివాదంపైనే నెల కిందట ఎర్రస్మగ్లర్‌ గంగిరెడ్డిని సైతం పోలీసులు విచారిస్తే తనకు సంబంధం లేదని గంగిరెడ్డి పోలీసులకు వివరించారు. ఇందులో కేసుల పై కేసులు నమోదు చేయడం గమనార్హం.

Theater Controversy : థియేటర్‌ వివాదం - కేసుల మయం
వివాదాస్పద సినిమా థియేటర్‌ ప్రహరీని కూల్చివేసిన దృశ్యం

తలదూర్చిన రాజకీయం

తలలు పట్టుకుంటున్న పోలీసులు

గంగిరెడ్డిని విచారించిన వైనం

ఎక్స్‌కవేటర్‌, హిటాచి సీజ్‌

పలువురిపై మూడు రకాల కేసులు నమోదు

రైల్వేకోడూరు, అక్టోబరు 11: పట్టణంలో ఒక సినిమా థియేటర్‌ వివాదంలో పోలీసులు ఇప్పటికే మూడు కేసులను నమోదు చేశారు. ఈ వివాదంలో రాజకీయ జోక్యం కలగడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నా రు. థియేటర్‌ స్థలం నాదంటే నాదని స్థానికులు పర స్పరం వాదులాడుకుంటున్నారు. స్థానిక రియల్‌ ఎస్టే టర్లు కొందరు ఈ వివాదంలో తలదూర్చడం విశేషం. ఈ వివాదంపైనే నెల కిందట ఎర్రస్మగ్లర్‌ గంగిరెడ్డిని సైతం పోలీసులు విచారిస్తే తనకు సంబంధం లేదని గంగిరెడ్డి పోలీసులకు వివరించారు. ఇందులో కేసుల పై కేసులు నమోదు చేయడం గమనార్హం. తమకు హైకోర్టు ఆదేశాలున్నాయని మరికొందరు భారీయం త్రాలతో థియేటర్‌ గోడను కూల్చి వేసిందుకు ప్రధా నంగా ముగ్గురు సహా మరికొందరిపై పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. ఇందులో పోలీసుల విధులకు ఆటంకం కల్గించినందుకు మరో కేసు నమోదు చేసి యంత్రాలను సీజ్‌ చేసినట్లు రైల్వే కోడూరు సీఐ హేమసుందర్‌రావు తెలిపారు. జిల్లా లోనే ఒక వెలుగు వెలిగిన సినిమా థియేటర్‌ వివాదం వివరాల్లోకెళితే...


Hitachi.gifపోలీసులు సీజ్‌ చేసిన లారీ సహా హిటాచీ, ఎక్స్‌కవేటర్‌

ఇద్దరు సోదరులు ఎకరాస్థలాన్ని ఏళ్ల కిందట రూ. 1లక్షకు కొనుగోలు చేశారు. సిమెంటు ధర బస్తా రూ.20 ఉన్న సమయంలో సినిమా థియేటర్‌ను నిర్మించారు. నిర్మాణ కార్మికులకు తక్కువ కూలీ ఉండ డం, పెద్దగా కూలీలు లేకున్నా థియేటర్‌ నిర్మాణాన్ని త్వరగానే పూర్తి చేశారు. అప్పట్లో రిలీజ్‌ సినిమా వేస్తే థియేటర్‌ యజమానే స్వయంగా బటన్‌ ఆన్‌ చేస్తే సినిమా ప్రదర్శన ప్రాంభించేవారు. థియేటర్‌ ఆవరణ లో ఆట విడుపు కోసం సోదరులు టెన్నిస్‌ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో పోటాపోటీగా కొత్త సినిమాలను విడుదల చేస్తూ భా రీగా ఆటలను ప్రదర్శించి సినిమా థియేటర్‌ ఒక వెలుగు వెలిగింది. ఇంత పేరున్న సినిమా థియేటర్‌ రానురాను కుంగిపోయి సినిమాలు ప్రదర్శించడం కష్ట మైంది. ఒక్కసారిగా సినిమా థియేటర్‌ యజమాను లు కుప్పకూలిపోయి థియేటర్‌ను లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత థియేటర్‌ను అమ్మకానికి పెట్టడంతో పలువురి చేతులు మారింది. ప్రస్తుతం యజమానుల ఇంట్లోనే వివాదం తలెత్తింది. మొదటి యజమానులు అనారోగ్యంతో మృతి చెందారు. ఎదిగి వచ్చిన పిల్లలకు ఏమీ మిగలలేదు.


ఉమ్మడి కడప జిల్లాలోనే కాకుండా స్థానిక నేతలు కూడా సినిమా థియేటర్‌ వ్యవహారంలోకి ప్రవేశించి స్థానికులపై కేసు లు పెట్టిస్తున్నారని ఆరోపణలున్నాయి. థియేటర్‌ను అమ్మి న వారు కొన్న వారి మధ్య నేటికీ కోర్టులో వివాదం జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా ఈ వివాదంలోకి కొత్త వారు ప్రవేశించడం, రాజకీయ జోక్యంతో వివాదం ముదిరిపాకా న పడింది. కాగా ఉమ్మడి కడప జిల్లా కు చెందిన ఒక రాజకీయ నేత సైతం తలదూర్చడంతో తారా స్థాయికి చేరింది. తమకు పవర్‌ ఆఫ్‌ పట్టా ఉందని జిల్లా స్థాయి రాజకీయ నాయకుడు ఇటీవల థియేటర్‌ పక్క నే ఉన్న గోడలను కూల్చి భూమి పూజ కూడా చేశా రు. విషయాన్ని చంద్ర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యా దు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేయగా రైల్వేకోడూరు పోలీసుల పై వత్తిడి పెరిగింది. తమకు హైకోర్టు ఆదేశా లున్నాయని మరికొంద రు భారీ యంత్రాలతో థియేటర్‌ గోడను కూల్చి నందుకు ప్రధానంగా ముగ్గురు సహా మరికొందరిపై గురువారం రాత్రి పోలీ సులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పోలీసు ల విధులకు ఆటంకం కల్గించినందుకు మరో కేసు న మోదు చేసి యంత్రాలను సీజ్‌ చేసినట్లు రైల్వేకోడూ రు సీఐ హేమసుందర్‌రావు తెలిపారు.


5KDR11.gif

సివిల్‌ వ్యవహారంలో తలదూర్చవద్దని హైకోర్టు ఉత్తర్వులు

థియేటర్‌ మే ము కొన్నామంటే మరో వర్గం మేము కొన్నామని వాదిస్తున్నారు. దీంతో అసలు విషయం అంతు చిక్క కుండా ఉండడం, అసలు యజమానులు ప్రత్యక్షంగా రాకపోవడం, కొసరు వాళ్లే రావడం కొసమెరుపు.

సీఐ ఏమంటున్నారంటే

సినిమా థియేటర్‌ వివాదంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించకుండా చేస్తున్నామని, చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని సీఐ హేమసుందర్‌ రావు తెలిపారు. నెల కిందట కొందరు థియేటర్‌ స్థలంలో గోడలు పడగొట్టారని నలుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. గురువారం థియేటర్‌ ప్రహరీని కూల్చివేయడంతో మళ్లీ ముగ్గురు మరి కొందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. గోడలు కూల్చిన యంత్రాలను సీజ్‌ చేశామని తెలిపారు. వివాదాస్పద థియేటర్‌ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కల్గించినందుకు మరి కొందరిపై కేసు నమోదు చేశామని వివరించారు.

పోలీసుల అత్యుత్సాహం

సినిమా థియేటర్‌ వివాదంలో పోలీసులు అత్యుత్సా హం చూపిస్తున్నారంటూ థియేటర్‌ స్థలాన్ని కొనుగో లు చేశామని చెప్పుకుంటున్న వ్యక్తులు చెబుతున్నారు. సివిల్‌ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకూడద ని హైకోర్టు నుంచి ఉత్తర్వులున్నా పోలీసులు జోక్యం ఎందుకు చూపిస్తున్నారని ఇటీవల కొనుగోలు చేసిన వారు ప్రశ్నిస్తున్నారు.


6KDR11.gif

సివిల్‌ వ్యవహారంలో తలదూర్చవద్దని హైకోర్టు ఉత్తర్వులు

సినిమా హాలు వివాదంపై జిల్లా స్థాయి అధికారి వత్తిడి ఉందని అందుకే పోలీ సులు వరుస కేసులు నమోదు చేస్తున్నారని ఆరో పిస్తున్నారు. ఫిర్యాది దారుడు ఊర్లో లేకున్నా వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు పరుగులు తీసి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పోలీ సులు సినిమాహాలు వివాదంలో తలదూర్చి ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టడం ఎంత వరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. కొనుగో లు దారుడి దగ్గర అసలు డ్యాక్యుమెంట్లు ఉన్నాయని ఫిర్యాది దారుడు చెబుతున్నాడని పోలీసులు అంటు న్నారు. కానీ అసలు సినిమా థియేటర్‌ యజమాను లు ఎవరన్నది అంతుచిక్కని రహస్యంగా మారింది.

Updated Date - Oct 12 , 2024 | 12:18 AM