Konaseema: ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్..
ABN , Publish Date - Jul 23 , 2024 | 01:10 PM
అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం బాగా ఉంది. రాజమండ్రి వద్ద గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జిలంక, ఎదుర్లమ్మలంక, కేతావారిలుకలోని 180 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది.
రాజమండ్రి: అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం బాగా ఉంది. రాజమండ్రి వద్ద గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జిలంక, ఎదుర్లమ్మలంక, కేతావారిలుకలోని 180 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని బూరుగులంక, ఊడిమూడిలంక, జి. పెడపూడిలంక, ఆరిగెలవారిపేట ప్రజలకు మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం కాజ్ వేపైకి వరద నీరు చేరి వీరపల్లిపాలెం, అయినవిల్లిలంక, అద్దంకివారిలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలకు అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. చింతూరు ఏజెన్సీలో 4 రోజులుగా ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు వద్ద జాతీయ రహదారుల పైకి వరద నీరు ప్రవహిస్తోంది. జాతీయ రహదారి-30పై చింతూరు మండలం చట్టి వద్ద, 326వ నంబరు హైవేపై కుయిగూరు వద్ద రాదారిపైకి వరద నీరు వచ్చి చేరుకుంటోంది.
పోలవరం పరిహారం, పునరావాస ప్యాకేజీ త్వరగా ఇస్తే గ్రామాలు ఖాళీ చేస్తామని వరద బాధితులు మొర పెట్టుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 85 వేల ఎకరాల్లో ముంపులో వరి పంట చిక్కుకుంది. 1250 ఎకరాల్లో ఉద్యాన, కూరగాయల పంటలు దెబ్బతిన్నది. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలివస్తున్నారు. పశుగ్రాసం, కొబ్బరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను లంక రైతులు జాగ్రత్త చేసుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కారు దిగనున్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!
ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Read Latest AP News and Telugu News