Share News

Tirumala: 9 నుంచి యూరప్‏లో శ్రీనివాస కల్యాణాలు

ABN , Publish Date - Oct 30 , 2024 | 01:31 PM

టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు, డిసెంబరు నెలల్లో యూకే, ఐర్లాండ్‌, యూరప్‏ల్లో ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్‌ వెలగా, కృష్ణ జవాజీ,లు మంగళవారం టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతి(Tirupati)లోని టీటీడీ పరిపాలన భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.

Tirumala: 9 నుంచి యూరప్‏లో శ్రీనివాస కల్యాణాలు

తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు, డిసెంబరు నెలల్లో యూకే, ఐర్లాండ్‌, యూరప్‏ల్లో ఎనిమిది దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్‌ వెలగా, కృష్ణ జవాజీ,లు మంగళవారం టీటీడీ ఈవో శ్యామలరావును తిరుపతి(Tirupati)లోని టీటీడీ పరిపాలన భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి నవంబరు 9 నుంచి డిసెంబరు 21 వరకు ఏపీ ఎన్‌ఆర్‌టీ శ్రీనివాస కల్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఈవోకు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Tirupati: ఏమార్చి.. నగలు కాజేసి!


ఈ తిరు కల్యాణ కార్యక్రమాల్లో టీటీడీ వేదపండితులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు. నవంబరు9న బెల్ఫా్‌స్ట(ఐర్లాండ్‌), 10న డబ్లిన్‌(ఐర్లాండ్‌), యూకేలో 16న బేసింగ్‌స్టోక్‌(యూకే), 17న ఐండోహోవెన్‌(నెదర్లాండ్స్‌), 23న హాంబర్గ్‌(జర్మనీ), 24న పారి్‌స(ఫ్రాన్స్‌), 30న వార్సా(పోలాండ్‌), డిసెంబరు1న స్టాక్‌హోం(స్వీడన్‌), 7న మిల్టన్‌కీన్స్‌(యూకే), 8న గ్లౌసెస్టర్‌(యూకే), 14న ఫ్రాంక్‌ఫర్ట్‌(జర్మనీ), 15న బెర్లిన్‌(జర్మనీ), 21న జ్యూరిచ్‌(స్వీట్జర్లాండ్‌)లో కల్యాణం నిర్వహించనున్నారు.


భక్తులకు టీటీడీ ఈవో దీపావళి శుభాకాంక్షలు

శ్రీవారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం

ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్‌ దాడులను ఎదుర్కొందాం

ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2024 | 01:31 PM