Share News

AP News: నేడు వరద ముంపు మండలాల్లో పర్యటించనున్న మంత్రుల బృందం..

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:00 AM

పశ్చిమగోదావరి జిల్లాలో నేడు వరద ముంపు మండలాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. వరద ముంపు ప్రాంతాలలో నేడు రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చయ్య నాయుడు, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కే పార్థసారథి పర్యటించనున్నారు.

AP News: నేడు వరద ముంపు మండలాల్లో పర్యటించనున్న మంత్రుల బృందం..

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో నేడు వరద ముంపు మండలాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. వరద ముంపు ప్రాంతాలలో నేడు రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చయ్య నాయుడు, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, కే పార్థసారథి పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలో ముంపు మండలాలు కుక్కునూరు, ఏలేరుపాడు, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. ముంపు మండలాల్లో నిర్వాసితులకు అందుతున్న ప్రభుత్వ సహాయ చర్యలపై పరిశీలన, సమీక్ష చేయనుంది. డెల్టాలో నష్టపోయిన వరి పంటను, ఆకుమడులను పరిశీలించిన అనంతరం నష్టాల పరిస్థితిపై తణుకులో జిల్లా అధికారులతో మంత్రులు రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రా జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం:1631.98 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 1,00,871 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 1,07,035 క్యూ సెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 101.695 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు నేడు పోతిరెడ్డిపాడు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేయనున్నారు. మరో రెండు రోజుల్లో మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద..

శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 2,58,069 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 45,236 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 861 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 109.0060 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు అలూరు సీతారామరాజు జిల్లా సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి జలాశయానికి వరద నీటి తాకిడి పెరుగుతుండడంతో జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి 6600 క్యూసెక్కుల నీటిని జెన్కో అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

YS Jagan : అసెంబ్లీపై అలిగిన జగన్‌

జగన్‌ పత్రికకు జనం సొమ్ము

Read more AP News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 09:00 AM