Share News

CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:28 PM

దాదాపు పది రోజులుగా సీఎం చంద్రబాబు కలెక్టరేట్‌లోనే ఉంటూ.. బస్సులోనే బస చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు, భువనేశ్వరీ దంపతుల పెళ్లి రోజు. అయినా సరే.. చంద్రబాబు ఇక్కడే వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో భువనేశ్వరి.. భర్తను కలిసేందుకు ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చారు.

CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..

అమరావతి: దాదాపు పది రోజులుగా సీఎం చంద్రబాబు కలెక్టరేట్‌లోనే ఉంటూ.. బస్సులోనే బస చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు, భువనేశ్వరీ దంపతుల పెళ్లి రోజు. అయినా సరే.. చంద్రబాబు ఇక్కడే వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో భువనేశ్వరి.. భర్తను కలిసేందుకు ఎన్టీఆర్ కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చారు. గత ఏడాది పెళ్లి రోజున చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇప్పుడు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో భువనేశ్వరి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఆమెతో కాసేపు మాట్లాడి వెంటనే చంద్రబాబు.. అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీ వర్షాలు, ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు. ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా ఎమ్యునరేషన్ జాగ్రత్తగా చేయాలన్నారు. ఈ రోజు సాయంత్రానికి వీధుల్లో నీళ్లన్నీ క్లియర్ అయిపోతాయన్నారు. పారిశుధ్యం పనులు నిరంతరం కొనసాగాలన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ బాగా జరుగుతోందని... నేటి సాయంత్రానికి సరుకుల పంపిణీ కూడా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.


విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలుగుతామని చంద్రబాబు పేర్కొన్నారు. మనది తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతమని.. దానికి అనుగుణంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలన్నారు. వర్ష సూచన ఉన్న జిల్లాల అధికారులను ముందుగానే అలెర్ట్ చేయడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని సీఎంకు ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈస్ట్, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతామారామరాజు, కాకినాడ జిల్లాల్లో ముందస్తు చర్యలతో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తత ఉండాలని.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వాగులు, వంకల పరిస్థితిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Updated Date - Sep 10 , 2024 | 12:28 PM