Minister Kolusu Partha Saradhi: ఈరోజు టాక్ ఆప్ ది నేషన్ చంద్రబాబు పని తీరే...
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:51 AM
ఈ రోజు టాక్ ఆప్ ది నేషన్.. సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజికి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు.
విజయవాడ: ఈ రోజు టాక్ ఆప్ ది నేషన్.. సీఎం చంద్రబాబు నాయుడు పనితీరేనని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. విజయవాడకు చరిత్రలో ఎన్నడూ లేని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజికి అది నిర్మించాక ఎన్నడూ రానంత వరద వచ్చిందన్నారు. వరద ముంపును ఎదుర్కొనే విధానంలో చంద్రబాబును అందరూ అభినందిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం ఏది లెక్కచేయకుండా బస్సులోనే ఉంటూ సహయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. చాలా ఇళ్లు మునిగిపోయి సామాన్యుడి జీవనం అతలాకుతలం అయ్యిందన్నారు. అయిదు, ఆరు రోజులు ఇదే పరిస్ధితి ఉండడంతో వారు ఆందోళన చెందారని పేర్కొన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, శాసనసభ్యులు.. బాధితులకు భరోసా కల్పించారని కొలుసు పార్థసారధి అన్నారు. ఫుడ్, వాటర్ సకాలంలో అందడం లేదా? అని ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారన్నారు. నాలుగయిదు రోజులు ఉండడం వల్ల మట్టి పేరుకు పోయి ఉంటే ఆ ఇళ్లను కూడా ఫైర్ ఇంజన్ లతో క్లీన్ చేస్తున్నారని తెలిపారు. కేవలం బురద జల్లడం కోసమే వైసీపీ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. సాక్షి, సాక్షి మీడియా ఇష్టానుసారం రాస్తూ రాక్షసానందం పొందడం కరెక్టు కాదన్నారు. ఈ పరిస్థితికి ఐదేళ్ల నాటి ప్రభుత్వమే కారణమన్నారు. ఆ ఐదు సంవత్సరాల్లో తూడు, సిల్ట్ తీయడానికి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. ఎందుకు చేయలేదో చెప్పాలంటూ నిలదీశారు. బుడమేరు ఎంత కుంచించుకుపోయిందో చూడాలని పార్థసారధి అన్నారు.
మీ ప్రభుత్వంలో పోలవరం పక్కన మట్టి, బుడమేరుపై ఉన్న మట్టిని తీసుకువెళ్లడం తప్ప అప్పటి ప్రభుత్వం ఏమీ చేయలేదని పార్థసారధి అన్నారు. ఇప్పడు ప్రభుత్వం బాధ్యత శానిటేషన్ అని.. ప్రతిచోటా చాలా బాగా చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శానిటేషన్ పరంగా, నష్టపోయిన వారికి పరిారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని పార్థసారధి పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2 లక్షల 40 వేల వరకూ గృహలకు నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారన్నారు. జిల్లాలో చాలా చోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వరి పంట, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. నూజివీడు, గన్నవరం చాలా చోట్ల చెరువులు బ్రీచ్ అయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వర్షాలు.. వరదల వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారి అందరికి న్యాయం చేస్తామని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.