Share News

AP News: అనంతపురం మార్కెట్‌లో టమాటా మాఫియా.. రైతులపై రౌడీయిజం

ABN , Publish Date - Aug 20 , 2024 | 09:34 AM

అనంతపురం మార్కెట్‌లో టమాటా మాఫియాపై రైతులు మండిపడ్డారు. మండీ అసోసియేషన్ పేరుతో రైతులపై రౌడీయిజం ప్రదర్శించారు. అసోసియేషన్ బెదరింపులతో టమాటా వేలాన్ని బయ్యర్లు నిలిపివేశారు.

AP News: అనంతపురం మార్కెట్‌లో టమాటా మాఫియా.. రైతులపై రౌడీయిజం

అనంతపురం: అనంతపురం మార్కెట్‌లో టమాటా మాఫియాపై రైతులు మండిపడ్డారు. మండీ అసోసియేషన్ పేరుతో రైతులపై రౌడీయిజం ప్రదర్శించారు. అసోసియేషన్ బెదరింపులతో టమాటా వేలాన్ని బయ్యర్లు నిలిపివేశారు. రైతులతో కలిసి హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై బయ్యర్లు బైఠాయించారు. ఒక్కో వాహనానికి రూ. 3 వేలు మండి అసోసియేషన్ వసూలు చేస్తోంది. కప్పం కట్టని వాహనాలు, రికార్డులను మండి అసోసియేషన్ లాక్కుంటోంది. మండీ అసోసియేషన్ తీరుతో రైతులు, బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.


సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిని టమాటా రైతులు దిగ్బంధించింది. లారీ అసోసియేషన్, మండీ అసోసియేషన్ దందాలను అరికట్టాలని జాతీయ రహదారిపై బైఠాయించారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లారీ అసోసియేషన్, మండి అసోసియేషన్ పేరుతో వ్యాపారస్తులను బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తుల లారీలు మార్కెట్లోకి రాకుండా లారీ అసోసియేషన్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బు ఇస్తేనే బయ్యర్లకు మండీల్లోకి అనుమతిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారికి పోలీసులు వత్తాసు పలకడంపై రైతులు మండిపడ్డారు. టమాటా బాక్సులను కొనుగోలు చేసే వ్యాపారస్తులు లేక నో సెల్ పడటంతో రైతులు ఆత్మహత్యే శరణం అంటున్నారు.


కిలో టమాటా ధర కొద్ది రోజుల క్రితం సెంచరీ దాటింది. ధర దడ పుట్టంచడంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు నానా తంటాలు పడ్డారు. రైతు బజార్లలో కిలో టమాటా రూ.67-70 వరకు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.100-110 పలుకుతోంది. ప్రస్తుతం టమాటా ధరలు బాగా దిగి వచ్చాయి. అసలే టమాటా ధర దిగి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు మాఫియా తోడై రైతులను మరింత ఇబ్బంది పెడుతున్నారు. లారీ అసోసియేషన్, మండి అసోసియేషన్ పేరుతో వ్యాపారస్తులను బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ రైతులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 20 , 2024 | 09:34 AM