Share News

Pattanakonda Market : టమోటా కిలో రూపాయే!

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:53 AM

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర 20 నుంచి 35 రూపాయల దాకా ఉంది.

Pattanakonda Market  : టమోటా కిలో రూపాయే!

  • పత్తికొండ మార్కెట్‌లో భారీగా పడిపోయిన ధర

పత్తికొండ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర 20 నుంచి 35 రూపాయల దాకా ఉంది. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో మాత్రం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. నాణ్యతను బట్టి గురువారం వీటి ధర 1 నుంచి 8 రూపాయల వరకు పలికింది. పత్తికొండ మార్కెట్‌కు రోజూ 200 టన్నుల టమాటా అమ్మకానికి వస్తోంది. ఇక్కడ టమాటాలు కొనుగోలు చేసిన వ్యాపారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పండుతున్న టమాటా దిగుబడులు మార్కెట్లకు వస్తుండడంతో పత్తికొండ నుంచి ఎగుమతి అవుతున్న టమాటాకు డిమాండ్‌ తగ్గింది. దీంతో వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారు. గురువారం మార్కెట్లో 20 కిలోల బాక్స్‌లు జత రూ.40కి వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహంతో టమాటాలను మార్కెట్లోనే పారబోసి వెళ్లిపోయారు. మరికొందరు గుత్తి-పత్తికొండ రహదారిపై రాస్తారోకో చేశారు.

Updated Date - Dec 13 , 2024 | 03:53 AM