Share News

Trains: గుంతకల్లు, గుత్తి మీదుగా వెళ్లే నాలుగు రైళ్లు దారి మళ్లింపు

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:55 PM

రైల్వే డివిజన్‌లోని సిమెంట్‌ నగర్‌-కృష్ణమ్మ కోన సెక్షన్‌లో, పాణ్యం స్టేషన్ల వద్ద జరుగుతున్న డబ్లింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు, గుత్తి(Guntakal, Gooty) మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను దారి మళ్లించనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Trains: గుంతకల్లు, గుత్తి మీదుగా వెళ్లే నాలుగు రైళ్లు దారి మళ్లింపు

గుంతకల్లు(అనంపురం): రైల్వే డివిజన్‌లోని సిమెంట్‌ నగర్‌-కృష్ణమ్మ కోన సెక్షన్‌లో, పాణ్యం స్టేషన్ల వద్ద జరుగుతున్న డబ్లింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు, గుత్తి(Guntakal, Gooty) మీదుగా వెళ్లే నాలుగు రైళ్లను దారి మళ్లించనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పూరి-యశ్వంతపూర్‌ గరీబ్‌ రథ్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(Puri-Yesvantpur Garib Rath Weekly Express) (నం. 22883)ను డిసెంబరు 6న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 22884)ను డిసెంబరు 7న డోన్‌ స్టేషన్‌ మీదుగా కాకుండా నంద్యాల, ఎర్రగుంట్ల(Nandyal, Erraguntla), గుత్తి ఫోర్ట్‌, అనంతపురం మీదుగా మళ్లిస్తున్నామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: త్వరలో ముగ్గురు వైపీసీ నేతలు జైలుకు వెళ్తారు..


pandu1.2.jpg

అలాగే హౌరా-యశ్వంతపూర్‌ వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(Howrah-Yesvantpur Weekly Superfast Express) (నం. 22831) రైలును డిసెంబరు 4, 11 తేదీల్లో, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 22832)ను డిసెంబరు 6, 13 తేదీల్లో గుత్తి-డోన్‌ సెక్షన్‌ మీదుగా కాకుండా అనంతపురం, గుత్తి ఫోర్ట్‌, ఎర్రగుంట్ల, నంద్యాల స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్టు రైల్వే అధికారులు వివరించారు.


ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2024 | 12:55 PM