తిరుమలలో మఠాల అద్దెల నియంత్రణపై ఉమ్మడి కమిటీ
ABN , Publish Date - Nov 27 , 2024 | 05:57 AM
తిరుమలలో మఠాల నిర్వహణపై అరోపణలు పెరగడంతో, వీటిపై నియంత్రణ చర్యలకు టీటీడీ శ్రీకారం చుట్టింది.
తిరుమల, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తిరుమలలో మఠాల నిర్వహణపై అరోపణలు పెరగడంతో, వీటిపై నియంత్రణ చర్యలకు టీటీడీ శ్రీకారం చుట్టింది. తిరుమలలో 34 మఠాలు ఉన్నాయి. వీటిలో విచ్చలవిడిగా అద్దెలు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నియంత్రణకు తొమ్మిదిమంది సభ్యులతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రెవిన్యూ డీఈవో, హెల్త్ ఆఫీసర్, విజిలెన్స్ వింగ్, ఇంజనీరింగ్ అధికారులతో పాటు విఖానస ఆశ్రమం, మౌనస్వామి మఠం, వాసవి భవన్, రాఘవేంద్రస్వామి మఠం, అహోబిలం మఠం నుంచి ఒక్కో ప్రతినిధి ఉంటారు.