దాబా సిబ్బందిపై దాడి కేసులో.. బోరుగడ్డను విచారించిన పోలీసులు
ABN , Publish Date - Nov 19 , 2024 | 06:24 AM
: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను తుళ్లూరు పోలీసులు సోమవారం విచారించారు. ఈ ఏడాది మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని దాబాలో పని చేస్తున్న వారిని బెదిరించి,
మంగళగిరి కోర్టులో హాజరు.. రాజమండ్రికి తరలింపు
నేడు మరో కేసులో తుళ్లూరు తీసుకొచ్చి విచారణ
తుళ్లూరు, నవంబరు 18: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను తుళ్లూరు పోలీసులు సోమవారం విచారించారు. ఈ ఏడాది మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని దాబాలో పని చేస్తున్న వారిని బెదిరించి, దాడి చేసిన సంఘటనపై అప్పట్లో అతడిపై కేసు నమోదైంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడిని పీటీ వారెంట్‌పై తుళ్లూరు స్టేషన్‌కు తీసుకొచ్చి సోమవారం ప్రశ్నించారు. డీఎస్పీ టీ.మురళీకృష్ణ మూడు గంటల పాటు అతడిని విచారించారు. ఒక రోజు కస్టడీ ముగియడంతో సాయంత్రం నాలుగున్నర గంటలకు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అలాగే మే 8వ తేదీ రాత్రే తుళ్లూరులో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ విధులకు ఆటంకం కలిగించడం, అసభ్యంగా మాట్లాడడం, విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేయడం తదితర సంఘటనలకు సంబంధించి అనిల్‌పై మరో కేసు నమోదై ఉంది. ఈ కేసులో మంగళవారం అతడిని తిరిగి రాజమండ్రి జైలు నుంచి తుళ్లూరు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించనున్నారు.