Share News

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులు తీపికబురు.. వైజాగ్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:18 PM

ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. పోర్టు నగరమైన విశాఖపట్నం నుంచి రెండు వందేభారత్ రైళ్లను మార్చి 12వ తారీఖు నుంచి ప్రవేశపెట్టబోతోంది. ఒకటి పుణ్యక్షేత్రమైన పూరికి.. మరొకటి వైజాగ్ నుంచి సికింద్రబాద్ మార్గంలో ఈ రైళ్లను నడపనుంది. వారానికి ఆరు రోజులపాటు నడిచే ఈ రెండు రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 12) ప్రారంభించనున్నారు.

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులు తీపికబురు.. వైజాగ్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు

ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. పోర్టు నగరమైన విశాఖపట్నం నుంచి రెండు వందేభారత్ రైళ్లను మార్చి 12వ తారీఖు నుంచి ప్రవేశపెట్టబోతోంది. ఒకటి పుణ్యక్షేత్రమైన పూరికి.. మరొకటి వైజాగ్ నుంచి సికింద్రబాద్ మార్గంలో ఈ రైళ్లను నడపనుంది. వారానికి ఆరు రోజులపాటు నడిచే ఈ రెండు రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 12) ప్రారంభించనున్నారు. ఈ రెండు రైళ్ల రాకతో.. ఇకపై వాల్తేరు డివిజన్ నుంచి మూడు వందేభారత్ రైళ్లు నడవనున్నాయి. శనివారం మినహా మిగిలిన అన్ని రోజులు వైజాగ్-పూరి మధ్య వందేభారత్ రాకపోకలు సాగనున్నాయి. ఇక వైజాగ్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు.. గురువారం మినహా మిగిలిన రోజుల్లో నడవనుంది.


తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ.. కలుపుతూ వైజాగ్-సికింద్రాబాద్ వందేభారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను గతేడాది జనవరి 15వ తేదీన ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రైలు మంచి ఆక్యుపెన్సీ రేటుతో నడుస్తోంది. ఇప్పుడు ఇదే లైన్‌లో మరో రైలుని జోడించడం జరిగింది. మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్‌లో ఈ రెండు రైళ్లను ప్రారంభిస్తారని.. వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ సౌరబ్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. వీటితో పాటు ఇతర ప్రాజెక్టులను సైతం ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు.

కాగా.. పూరి-వైజాగ్ వందేభారత్ సూపర్‌ఫాస్ట్ రైలు పూరిలో (20841) ఉదయం 5:15 గంటలకు బయలుదేరి, 11:30 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. అనంతరం వైజాగ్‌ (20842) నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి.. అదే రోజు రాత్రి 9:55 గంటలకు పూరికి చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ సూపర్‌ఫాస్ట్ రైలు సికింద్రాబాద్‌లో (20707) ఉదయం 5:05 గంటలకు బయలుదేరి, అదే రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అనంతరం విశాఖపట్నంలో (20708) మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2024 | 10:20 PM