Share News

Konaseema: కోనసీమ జిల్లాలో పాస్టర్ ఘరానా మోసం

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:59 PM

నిరుద్యోగాన్ని ఆ పాస్టర్ ఆసరా చేసుకున్నాడు. ఇజ్రాయోల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మి కోట్లాది రూపాయిలు ఆ పాస్టర్ చేతిలో పెట్టారు. కాలం గడుస్తున్నా.. పాస్టర్ ఇజ్రాయోల్ పంపడు. తీసుకున్న నగదు ఇవ్వడు. దీంతో తమ నగదు తమకు ఇవ్వాలంటూ పాస్టర్‌ను నిరుద్యోగులు నిలదీశారు. దాంతో చంపేస్తానంటూ వారిని పాస్టర్ బెదిరించాడు. జిల్లా ఉన్నతాధికారులను నిరుద్యోగులు ఆశ్రయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన పాస్టర్ నగదుతో ఆదృశ్యమయ్యాడు.

Konaseema: కోనసీమ జిల్లాలో పాస్టర్ ఘరానా మోసం

అమలాపురం, అక్టోబర్ 21: కోనసీమ జిల్లాలో నిరుద్యోగులను ఓ పాస్టర్ నిలువునా ముంచేశాడు. వారందరిని ఇజ్రాయోల్‌ పంపుతానంటూ నిరుద్యోగులకు నమ్మబలికాడు. ఆ క్రమంలో వారి వద్ద నుంచి కోట్లాది రూపాయిల నగదు వసూల్ చేశాడు. కాలం గడుస్తున్న ఇజ్రాయోలు మాత్రం పంపకపోవడంతో నిరుద్యోగులకు సందేహం వచ్చింది. దీంతో తమను ఇజ్రాయోల్ పంపాలి.. లేకుంటే నగదు వాపస్ ఇవ్వాలంటూ పాస్టర్‌ను నిలదీశారు. దీంతో ఆగ్రహించిన పాస్టర్.. వారిని చంపేస్తానంటూ బెదిరించాడు.

Also Read: Pawan Kalyan: ఉత్తరాంధ్రలో బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్


అనంతరం పాస్టర్ నగదు తీసుకుని పరారయ్యాడు. దీంతో బాధితులుగా మారిన నిరుద్యోగులు జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీని ఆశ్రయించారు. వారి సూచనలతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బాధితులంతా.. అమలాపురం, అల్లవరం, రాజోలు, గన్నవరం, ఒంగోలుకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. పాస్టర్‌కు తాము రూ.1.50 కోట్ల నగదు చెల్లించామని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు స్పష్టం చేశారు.

Also Read: Telangana MLA: తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


పాస్టర్ వల్ల 31 మంది బాధితులుగా మారామని వారు పేర్కొన్నారు. విశ్వాసుల ప్రార్ధన మందిరం పేరుతో పాస్టర్ సంఘం నడుపుతూ తమ వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూల్ చేశాడని పోలీసుల ఎదుట బాధితులు వాపోయారు. ఇక పాస్టర్ జాడా తెలుసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: సీమ చింతకాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఉపాధి చూపక పోవడంతోపాటు ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. దీంతో జగన్ ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మారారు. అలాంటి వేళ.. తనక ఇజ్రాయోల్‌లో తెలిసిన వాళ్లు ఉన్నారని.. అక్కడ ఉపాధి అవకాశాలు సైతం అధికంగా ఉంటాయంటూ నిరుద్యోగ యువతకు ఎర వేశారు. దీంతో అతడి మాటలు నమ్మి.. కోట్లాది రూపాయిలు పాస్టర్ చేతిలో పోశారు. కాలం గడుస్తున్నా.. ఉద్యోగం లేదు. ఇజ్రాయోల్ లేదు.


దీంతో అనుమానించిన నిరుద్యోగులు పాస్టర్ ఇంటి వద్ద ఆందోళలనకు దిగారు. తమకు కట్టిన నగదు తిరిగా వాపస్ ఇవ్వాలంటూ పాస్టర్‌ను డిమాండ్ చేశారు. దీంతో పాస్టర్ ఆగ్రహించి.. నగదు అడిగితే చంపేస్తానంటూ నిరుద్యోగులను బెదిరించాడు. దీంతో తమకు జరిగిన అన్యాయంపై నిరుద్యోగులు జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న పాస్టర్.. ఆ ఉరి విడిచి పరారయ్యాడు. దీంతో పాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 06:52 PM