AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సామాన్యులకు అందుబాటు ధరల్లో..
ABN , Publish Date - Nov 09 , 2024 | 11:39 AM
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో..
అమరావతి: మరో 3-4నెలల్లో ఏపీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సీ ప్లేన్ కార్యక్రమం షో ఆఫ్ ప్రోగ్రామ్ లా కాకుండా అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఓ సవాల్ గా తీసుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల వారూ సీ ప్లేన్ ప్రయాణం వినియోగించేలా ధరలు ఉంటాయని తెలిపారు. ఇందుకనుగుణంగా నిర్వాహకలకు తగు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
4 రూట్లలో..
ఏపీలో 4 రూట్లలో సీ ప్లేన్ ప్రయాణం ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వైబులిటీ గ్యాప్ ని ఫిల్ చేసేందుకు ఉదన్, టూరిజం శాఖలతో సమన్వయ పరుచుకుంటున్నామన్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా సీ ప్లేన్ ధరలు ఉంటాయని స్పష్టం చేశారు. పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీ ప్లేన్ పట్ల సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సీ ప్లెయిన్స్ ఆపరేటింగ్‌కి కేవలం రెండు కిలోమీటర్లు వాటర్ ఉంటే సరిపోతుందన్నారు. ఎయిర్ పోర్ట్స్ లేని ప్రాంతంలో సీ ప్లేన్స్ బాగా ఉపయోగపడతాయని కామెంట్స్ చేశారు.