Uttarakhand High Court : జస్టిస్ నరేందర్ న్యాయసేవలు భేష్
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:03 AM
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న జస్టిస్ జి. నరేందర్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది.
బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి హైకోర్టు ఘన వీడ్కోలు
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న జస్టిస్ జి. నరేందర్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. మంగళవారం హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ నరేందర్ ఎన్నో కీలక తీర్పు ఇచ్చారన్నారు. న్యాయ వ్యవస్థ పురోగతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. జస్టిస్ జి.నరేందర్ మాట్లాడుతూ ఏపీ హైకోర్టులో పనిచేసిన 14 నెలల కాలం తన జీవితంలో గుర్తుండిపోతుందన్నారు. కాగా, జస్టిస్ నరేందర్ ఇచ్చిన తీర్పులు న్యాయ సమాజానికి మార్గనిర్దేశికంగా ఉంటాయని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ పసల పొన్నారావు కొనియాడారు. జస్టిస్ నరేందర్‌ను న్యా యవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, కార్యవర్గం సన్మానించింది.