Share News

Vangalapudi Anitha: హోం శాఖే ఎందుకు..?

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:23 PM

ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే.. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోం శాఖ మంత్రిదేనన్నది సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు.

Vangalapudi Anitha: హోం శాఖే ఎందుకు..?
AP Home Minister V Anitha

ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే.. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోం శాఖ మంత్రిదేనన్నది సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు. అయితే హోం శాఖను అనితకు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో ఓ వాడి వేడి చర్చ అయితే ఊపందుకుంది. ఆమెకు ఈ శాఖను కేటాయించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేశారనే ఓ చర్చ సైతం నడుస్తుంది.

తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు చాలా మందే ఉన్నా.. వారిలో ఫైర్ బ్రాండ్ల్ మాత్రం అతి కొద్దిమందే ఉన్నారు. వారిలో తొలి వరుసలో ఉన్న నేతల్లో వంగలపూడి అనిత ఒకరన్నది సుస్పష్టం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు మంత్రులు.. ప్రతిపక్ష పార్టీ అధినేతలపై మాటల దాడికి దిగితే.. వాటినన్నింటికి తన మాటలతో సమాధానమిచ్చిన ఒకే ఒక్క మహిళా నేత వంగలపూడి అనిత. అందులోభాగంగానే వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ నుంచి పార్టీలోని మంత్రుల వరకు ఎవరికి, ఎలా.. ఎంత మోతాదులో సమాధానమివ్వాలో.. అంతే స్థాయిలో అనిత కౌంటర్ ఇచ్చిన విషయాన్ని రాజకీయ వర్గాలు ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నాయి.

Also Read: NMD Farooq: అఘోరా అలా చెప్పాడు.. ఇలా ఫరూక్ మంత్రి అయ్యాడు!


మరోవైపు గత ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ కేబినెట్‌లో హోం శాఖ మంత్రులుగా మేకతోటి సుచరిత, తానేటి వనిత పని చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినా.. వారికి అన్యాయం జరిగినా హోం శాఖ మంత్రులుగా.. అది కూడా సాటి మహిళలుగా వీరు స్పందించిన తీరు పట్ల విమర్శలు సైతం వెల్లువెత్తాయి. కానీ వంగలపూడి అనిత మాత్రం తనదైన శైలిలో హోం మంత్రిగా దూసుకు వెళ్తారనే ఓ చర్చ సైతం సాగుతుంది. ఇక తానేటి వనిత, మేకతోటి సుచరిత, అనితలది ఒకే సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితను సైతం హోం శాఖ మంత్రిగా ఎంపిక చేసి ఉండవచ్చుననే అభిప్రాయం సైతం సదరు వర్గాల్లో వ్యక్తమవుతుంది.

Also Read:Telangana: యూనిట్లు 294.. కరంట్ బిల్లు రూ. 29 కోట్లు


అయితే గత ఎన్నికల్లో.. అంటే 2019 ఎన్నికల్లో కోవ్వూరు టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత బరిలో దిగి.. తన సమీప ప్రత్యర్థి తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి అనిత మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో సైతం ఆమె ఇదే అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాడు టీడీపీ ప్రభుత్వంలో విప్‌గా ఆమె వ్యవహరించారు.


ఇంకోవైపు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తమ పనితనం ఎలా ఉంటుందో ఇదే వంగలపూడి అనిత.. దాదాపు ఏడాది క్రితం ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోదాహరణగా వివరించిన విషయం ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి వైసీపీ చేసిన ఆరోపణలకు పక్కాగా లెక్కలు సరి చూసేందుకే వంగలపూడి అనితకు ఈ శాఖను కేటాయించారనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తుంది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 04:25 PM