Home » Payakaraopet
పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.
ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే.. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోం శాఖ మంత్రిదేనన్నది సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు.
ఈ నియోజకవర్గంలో పోటీ చేసినవారు ఒకసారి ఓడిపోతే ఇక అంతే సంగతులు. రెండోమారు మళ్లీ గెలిచిన సందర్భాలు లేవు. గంటెల సుమన, చెంగల వెంకట్రావు, కాకర నూకరాజు పాయకరావుపేట నుంచి పలుమార్లు పోటీ చేశారు. అయితే ముగ్గురూ ఒకసారి ఓడిపోయిన తరువాత
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని(YSRCP) భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నికల వేళ అభ్యర్థులు.. తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత ఎన్నికల బరిలో నిలిచారు.