Share News

Pawan Kalyan: వారాహి దీక్ష పరిసమాప్తం.. ఇకపై చాతుర్మాస దీక్ష చేపట్టనున్న పవన్..

ABN , Publish Date - Jul 06 , 2024 | 07:13 AM

సమాజ సంక్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష... వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది.

Pawan Kalyan: వారాహి దీక్ష పరిసమాప్తం.. ఇకపై చాతుర్మాస దీక్ష చేపట్టనున్న పవన్..

అమరావతి: సమాజ సంక్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష... వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్‌ కల్యాణ్‌ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతితో పాటు నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణం అయింది.


వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ్‌ శర్మ, వేణుగోపాల శర్మ పూజాక్రతువు పూర్తి చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఇకపై పవన్‌ కల్యాణ్‌ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గతంలోనూ పవన్ ఈ దీక్షను అవలంబించిన విషయం తెలిసిందే. చాతుర్మాస దీక్షను రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ దీక్ష ఆషాడం, శ్రావణం, భాద్రపదం, అశ్వీయిజమాసం కలిసి నాలుగు మాసాల పాటు ఈ దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. గృహస్తాచార రీతిలో ఈ దీక్షను తలపెడుతున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభ తిధుల్లో మాత్రం దీక్షా వస్త్రాలు ధరిస్తారు.

భయపడొద్దు.. రండి!

Updated Date - Jul 06 , 2024 | 08:23 AM