Visakhapatnam : ఎండలు..వానలు..
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:24 AM
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. అయితే, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా వైపు తేమగాలులు వీస్తున్నాయి.
జంగమహేశ్వరపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయి. అయితే, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా వైపు తేమగాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. జంగమహేశ్వరపురంలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.