Share News

Chandrababu: ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది

ABN , Publish Date - Aug 22 , 2024 | 01:42 PM

అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను మెడికవర్‌ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు( గురువారం) పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Chandrababu: ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది

విశాఖపట్నం: అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను మెడికవర్‌ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు( గురువారం) పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్నివిధాలా చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా రక్షించుకుంటామని హామీ ఇచ్చారు. తాము అండగా ఉంటామని.. ధైర్యంగా ఉండాలని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు.


అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తామని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే, మెడికవర్‌ ఆస్పత్రి దగ్గర సీఎం చంద్రబాబు భావోద్వేగం అయ్యారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మంది మృతి, 36 మందికి గాయాలయ్యాయాని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలు అయ్యాయని తెలిపారు.

cbn-2.jpg


cbn-4.jpg

బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

cbn-3.jpg

Updated Date - Aug 22 , 2024 | 01:53 PM