Share News

గంజాయి కేసులో ముద్దాయిలకు పదేళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:24 AM

గంజాయి కేసులో ఐదుగురుముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎ.రత్నకుమార్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన జాజిమొగ్గల సంతోష్‌, వడ్డాది రమణ, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లికి చెందిన సీదరి సుబ్బారావు, చింతాడ లక్ష్మయ్య, కొర్రా బాబూరావులు 2015 ఫిబ్రవరి 16వ తేదీన 120 కిలోల గంజాయి రవాణా చేస్తూ చీడికాడ పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పట్లో వీరిపై ఎస్‌ఐ విశ్వనాఽథం కేసు నమోదు చేశారు.

గంజాయి కేసులో ముద్దాయిలకు పదేళ్ల జైలు శిక్ష

ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా

... చెల్లించని పక్షంలో మరో రెండున్నరేళ్లు కారాగారం

చోడవరం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గంజాయి కేసులో ఐదుగురుముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎ.రత్నకుమార్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన జాజిమొగ్గల సంతోష్‌, వడ్డాది రమణ, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లికి చెందిన సీదరి సుబ్బారావు, చింతాడ లక్ష్మయ్య, కొర్రా బాబూరావులు 2015 ఫిబ్రవరి 16వ తేదీన 120 కిలోల గంజాయి రవాణా చేస్తూ చీడికాడ పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పట్లో వీరిపై ఎస్‌ఐ విశ్వనాఽథం కేసు నమోదు చేశారు. నిందితులపై మోపిన నేరం రుజువుకావడంతో జడ్జి రత్నకుమార్‌ ముద్దాయిలందరికీ పదేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండున్నర సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉగ్గిన వెంకటరావు వాదించారు.

Updated Date - Nov 16 , 2024 | 12:24 AM