Share News

రూ.1.47 లక్షల విలువైన కలప స్వాధీనం

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:50 PM

మండలంలోని కాకరపాడు అటవీ సెక్షన్‌ పరిధి కాకరపాడులో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.1.47 లక్షల విలువైన రోజ్‌వుడ్‌, టేకు, గన్నర దుంగలను అటవీ రేంజర్‌ బుధవారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

రూ.1.47 లక్షల విలువైన కలప స్వాధీనం
పట్టుబడిన కలపతో రేంజర్‌ శివరంజని, అటవీ సిబ్బంది

కాకరపాడులో అక్రమంగా నిల్వ

పట్టుకుని కేసు నమోదు చేసిన అటవీ రేంజర్‌

కొయ్యూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాకరపాడు అటవీ సెక్షన్‌ పరిధి కాకరపాడులో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.1.47 లక్షల విలువైన రోజ్‌వుడ్‌, టేకు, గన్నర దుంగలను అటవీ రేంజర్‌ బుధవారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పెదవలస రేంజర్‌ శివరంజని తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అటవీ సంపద అక్రమ రవాణా, నిల్వలను అరికట్టే చర్యల్లో భాగంగా అటవీ రేంజర్‌ తన సిబ్బందితో కలిసి కాకరపాడు తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించారు. కాకరపాడు గ్రామంలో కొప్పిశెట్టి లోవరాజు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.1.31 లక్షల విలువ చేసే 26 రోజ్‌వుడ్‌ దుంగలు పట్టుబడ్డాయి. అలాగే గ్రామ శివార్లలో తుప్పల మధ్య అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 19 రోజ్‌వుడ్‌, 5 టేకు, 20 గన్నర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.16 వేలు ఉంటుంది. మొత్తం పట్టుబడిన కలప విలువ రూ.1.47 లక్షలు ఉంటుందని, దీనిపై కేసు నమోదు చేసి కలపను శింగవరం కలప డిపోనకు తరలించామని రేంజర్‌ తె లిపారు.

Updated Date - Nov 13 , 2024 | 11:50 PM