Share News

జిల్లాకు 850 పశువుల గోకులం షెడ్లు మంజూరు

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:26 AM

జిల్లాకు 850 పశువుల గోకులాల షెడ్లు మంజూరు అయినట్టు పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీడైరెక్టర్‌ నరసింహ తెలిపారు.

 జిల్లాకు 850 పశువుల గోకులం షెడ్లు మంజూరు
కోటవురట్లలో జరిగిన అవగాహన సదస్సులోమాట్లాడుతున్న డీడీ నరసింహ

పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహ

కోటవురట్ల, జూన్‌ 20: జిల్లాకు 850 పశువుల గోకులాల షెడ్లు మంజూరు అయినట్టు పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీడైరెక్టర్‌ నరసింహ తెలిపారు. గురువారం స్ధానిక మండల పరిషత్‌ సమవేశమందిరంలో మాకవరపాలెం, కోటవురట్ల మండలాలకు చెందిన పశుసంవర్థక శాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోకులాల షెడ్లు పశువులు పెంపకందారులకు మాత్రమే మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి 40 నుంచి 45 వరకు గోకులాల షెడ్లు కేటాయిస్తామన్నారు. ఈ సీజన్‌లో అధికంగా పశువులకు గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు సోకే ప్రమాదం వుందన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏడీ సింహద్రప్పడు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 12:26 AM