పర్యాటకుల కోలాహలం
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:45 AM
మండలంలోని కొత్తపల్లి జలపాతంలో శనివారం పర్యాటకుల కోలాహలం కనిపించింది. రెండవ శనివారం సందర్భంగా సెలవు రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు.
జి.మాడుగుల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొత్తపల్లి జలపాతంలో శనివారం పర్యాటకుల కోలాహలం కనిపించింది. రెండవ శనివారం సందర్భంగా సెలవు రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు.
బొర్రా గుహలు వద్ద..
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. రోడ్డు, రైలు మార్గాల గుండా అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో గుహలు ప్రాంగణం కిక్కిరిసింది. శనివారం 7,700 మంది గుహలను సందర్శించగా, రూ.6.30 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు.