Share News

పర్యాటకుల కోలాహలం

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:54 AM

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు మంగళవారం, బుధవారం పర్యాటకులు పోటెత్తారు. వర్షాన్ని సైతం పర్యాటకులు లెక్కచేయకుండా పర్యాటక ప్రాంతాలను తిలకించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. మంగళవారం ఆరు వేల మంది పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించగా రూ.5.30 లక్షల ఆదాయం వచ్చిందని, అలాగే బుధవారం ఐదు వేల మంది తిలకించగా రూ.5 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్‌ గౌరీశంకర్‌ తెలిపారు.

పర్యాటకుల కోలాహలం
బొర్రా గుహలు వద్ద పర్యాటకులు

- వర్షాన్ని సైతం లెక్క చేయని వైనం

అనంతగిరి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు మంగళవారం, బుధవారం పర్యాటకులు పోటెత్తారు. వర్షాన్ని సైతం పర్యాటకులు లెక్కచేయకుండా పర్యాటక ప్రాంతాలను తిలకించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. మంగళవారం ఆరు వేల మంది పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించగా రూ.5.30 లక్షల ఆదాయం వచ్చిందని, అలాగే బుధవారం ఐదు వేల మంది తిలకించగా రూ.5 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్‌ గౌరీశంకర్‌ తెలిపారు. కాగా జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలు కూడా పర్యాటకులతో బుధవారం రద్దీగా కనిపించాయి.

Updated Date - Dec 26 , 2024 | 12:54 AM