Share News

గంజాయి కట్టడికి ప్రత్యేక కార్యాచరణ

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:50 AM

మండలంలో గంజాయి సాగు కట్టడికి పోలీస్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. సాగు ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వేను నిర్వహిస్తోంది. గంజాయి సాగు, రవాణా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తొలుత గంజాయి సాగు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసిన అనంతరం దాడులు చేయాలని సంకల్పించింది.

గంజాయి కట్టడికి ప్రత్యేక కార్యాచరణ
డ్రోన్‌ ద్వారా సర్వే నిర్వహిస్తున్న పోలీసులు

సాగు, రవాణాపైనే ప్రధాన దృష్టి

పలు ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే

తర్వాత దాడులు చేసేందుకు పోలీస్‌ శాఖ వ్యూహం

నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసిన యంత్రాంగం

డుంబ్రిగుడ, సెప్టెంబరు 29: మండలంలో గంజాయి సాగు కట్టడికి పోలీస్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. సాగు ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వేను నిర్వహిస్తోంది. గంజాయి సాగు, రవాణా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తొలుత గంజాయి సాగు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసిన అనంతరం దాడులు చేయాలని సంకల్పించింది. అలాగే ఎక్కడ సాగు అవుతోంది.. ఎలా రవాణా అవుతోందన్న విషయమై నిఘాను పెంచింది. ఈ మేరకు ఆదివారం మండలంలో గంజాయి సాగు ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేసినట్టు ఎస్‌ఐ పాపినాయుడు తెలిపారు. తొలుత గతంలో గంజాయి సాగు చేసిన ప్రాంతాల్లో డ్రోన్‌ సర్వేను చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎవరైనా సాగు, రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Sep 30 , 2024 | 12:50 AM