Share News

కాఫీ కొనుగోలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:16 PM

ఈ ఏడాది కాఫీ గింజల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు.

కాఫీ కొనుగోలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు
జీసీసీ గోదాములో తూనిక యంత్రాలను పరిశీలిస్తున్న జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌

జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ హెచ్చరిక

జీసీసీపై నమ్మకం పెంచండి

పాడేరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది కాఫీ గింజల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని గిరిజన సహకార సంస్థ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. స్థానిక జీసీసీ డీఎం, బీఎం కార్యాలయాలు, అక్కడున్న గోదాములను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కాఫీ రైతులకు సంస్థ నుంచి మేలు చేయాలనే లక్ష్యంతోనే కాఫీ గింజల కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 2 వేల టన్నుల కాఫీ గింజల కొనుగోలు లక్ష్యం చేరేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని, ప్రధానంగా డివిజనల్‌, బ్రాంచ్‌ మేనేజర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. జీసీసీపై గిరిజన కాఫీ రైతులకు నమ్మకం కలిగేలా చూడాలని, జీసీసీ బలోపేతానికి, గిరి రైతులకు సేవలందించేందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ బి.వెంకటేశ్‌, డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, టీడీపీ నేతలు పాండురంగస్వామి, బుక్కా జగదీశ్‌, ద్రౌపతి, కళ, మురళీ, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:16 PM