Nadendla: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:22 PM
Andhrapradesh: రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నారని.. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబర్ 5: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సీరియస్‌గా ఉన్నారని.. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంతో రైస్ మిల్లర్ల అసోసియేషన్ కలిసి పని చేయాలన్నారు. రైతులెవరు ఆందోళన చెందవద్దని.. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజ కొంటామని స్పష్టం చేశారు. పది రోజుల్లో 10.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
ఈ తాతా మరీ అమాయకత్వంగా ఉన్నాడే..
ఐదు రోజులు ఉత్తరాంధ్రలో పర్యటిస్తానని.. ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. 229 కోట్ల సొమ్ములు 24 గంటల్లో రైతుఖాతాలో జమ చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ సమయానికి కేవలం 2092 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలలో వాస్తవం లేదని వెల్లడించారు. విశాఖ, కృష్ణ పట్నం పోర్టుల కంటే రెండింతల బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళిపోయిందని తెలిపారు. కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం తరలింపులో కొందరు సీనియర్ అధికారులు ఉన్నారని.. అదే బాధ కలిగించిందన్నారు. వైసీపీ హయంలో పోర్టులను స్మగ్లింగ్ డన్‌గా మార్చేశారని విమర్శించారు.
ఆ ఒప్పందాలపై ఏసీబీకి వైఎస్ షర్మిల ఫిర్యాదు
ఏది ఏమైనా సీబీసీఐడీ విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. స్టెల్లా షిప్‌లో ప్రతి అణువణువు కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందన్నారు. అక్రమ బియ్యం రవాణా అంశాలలో ఇప్పటి వరకూ729 మందిని, 102 వాహనాలు సీజ్ చేశామన్నారు. విశాఖలో ప్రాంతీయ సదస్సు నిర్వహించామని ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
పాకిస్తాన్ పేరు మార్చండి మహాప్రభో..!
AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు
Read Latest AP News And Telugu News